Chamala Kirankumar Reddy | శంషాబాద్‌లో మిక్సాలజిస్ట్‌కు ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది?
Chamala Kirankumar Reddy | తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే తాము ఫామ్‌హౌస్ లను పరిశీలిస్తున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మిక్సాలజిస్ట్‌కు శంషాబాద్‌లో ఫామ్‌హౌస్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
- ఫామ్‌హౌస్‌ల కల్చర్ తెచ్చిందే బీఆర్ఎస్
- 400 ఎకరాలు కేసీఆర్ ఆధీనంలో ఉన్నయ్
- తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మేం ఫామ్‌హౌస్‌లను పరిశీలిస్తున్నం
- మీడియా సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
Chamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే తాము ఫామ్‌హౌస్ లను పరిశీలిస్తున్నామని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తొమ్మిది జిల్లాల్లో, 24 మండలాలు, 33 గ్రామ పంచాయతీల్లో 400 ఎకరాలకు పైగా భూములు కేసీఆర్ కుటుంబం ఆధీనంలో ఉన్నాయని ఆరోపించారు. మిక్సాలజిస్ట్ జగదీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) కి శంషాబాద్‌లో ఫామ్‌హౌస్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇదే సూర్యాపేటలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఉప్పల మల్సూర్ కుటుంబం ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకుందని గుర్తు చేశారు. ఈమేరకు సోమవారం శంషాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న 300 ఎకరాలకు పట్టాలు ఎందుకు ఇయ్యలేదు. దొరవారి ఫామ్‌హౌస్ ఏమో ఎంతో పెద్దగా ఉంది. నిజాం నవాబు 200 ఏళ్ళలో ఆస్తులు కూడబెడితే కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ళలో ఆస్తులు సంపాదించింది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతా చారి తల్లి ఇంకా ఊర్లోనే ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత పదవులు పొంది మిక్సింగ్ చేసేవాళ్ళు బాగు పడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఫామ్‌హౌస్ కల్చర్ ను తెచ్చింది. కేసీఆర్‌ను చూసి హరీష్ రావు ఫామ్‌హౌస్ కట్టారు. హరీశ్‌రావును చూసి కేటీఆర్ ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారు. కేటీఆర్‌ను చూసి జగదీష్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ లు కట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్లకు ఎన్ని ఫామ్‌హౌస్ లు ఉన్నాయి.
రాంచంద్రారెడ్డి, వినోభా బావే వంటి వాళ్లు ఉన్న భూములు ఇచ్చిన దాఖలాలు ఉన్నయ్. తెలంగాణ సాధిద్దామని ఉన్న ఆస్తులు కోల్పోయినవాళ్లు ఎంతో మంది ఉన్నరు. గద్దర్, కోదండరామ్ లాంటివాళ్లు ఉద్యమ సమయంలో ఆస్తులు కోల్పోయారు. అప్పటి నాయకులకు పేదల కోసం ఏదో చేయాలన్న ఆలోచన ఉండే. పేదలను ధనవంతులను చేయాలని వారు పని చేశారు. తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ఏమైతుందో తెలుసు.
సోడా వాటర్ మిక్స్ చేసి ఎదిగిండు..
నయా నవాబ్ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు మిక్సాలజిస్ట్ అంటే ఎవరో అనుకునేరు. ఏమీ లేని మిక్సాలజిస్ట్ జగదీశ్‌రెడ్డి సోడా వాటర్ మిక్స్‌తోటి పెద్ద నవాబు మెప్పు పొందిండు. హుజూర్‌నగర్‌ల 2009ల మొదటిసారి ఎలక్షన్ల నిలవడ్డడు. ఆరోజు అఫిడవిట్ల 12 లక్షల ఆస్తులు ఆయనవి. అంచలంచెలుగా 14కు పెరిగినయ్. ఆ తర్వాత 18.. 23 కు వచ్చి కోట్లల్లకు పోయినయ్. ఇది ఎట్ల పెరిగింది? తన నియోజకవర్గంతో సంబంధం లేకుండా జగదీశ్‌రెడ్డికి శంషాబాద్ లో ఫామ్‌హౌస్ ఎలా వచ్చింది? అని చామల ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●Vaishnavi Chaitanya | వయసుపై తప్పుడు ప్రచారం - ఆధార్ కార్డ్‌తో క్లారిటీ ఇచ్చిన బేబీ హీరోయిన్
- ●YouTuber Nandana Visa Scam | యూకే జాబ్స్ పేరుతో యూట్యూబర్ నందన భారీ మోసం కేసు.. ప్రజావాణికి పోటెత్తిన బాధితులు
- ●Land Acquisition | సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం
- ●Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
- ●Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..
- ●Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

Vaishnavi Chaitanya | వయసుపై తప్పుడు ప్రచారం - ఆధార్ కార్డ్‌తో క్లారిటీ ఇచ్చిన బేబీ హీరోయిన్

YouTuber Nandana Visa Scam | యూకే జాబ్స్ పేరుతో యూట్యూబర్ నందన భారీ మోసం కేసు.. ప్రజావాణికి పోటెత్తిన బాధితులు

Land Acquisition | సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం

Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు





