YouTuber Nandana Visa Scam | యూకే జాబ్స్ పేరుతో యూట్యూబర్ నందన భారీ మోసం కేసు.. ప్రజావాణికి పోటెత్తిన బాధితులు
యూకేలో జాబ్‌ల పేరుతో కోట్లలో టోపీ! విజిటర్ వీసాలపై వెళ్లిన వారి నుంచి రూ.95 లక్షల వరకు వసూలు.. సీఎం ప్రజావాణికి క్యూ కట్టిన బాధితులు, పూర్తి వివరాలు ఇవే.
సంక్షిప్త సారాంశం
యూకేలో స్థిరపడిన యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్.. వీసాలు, ఉద్యోగాల పేరుతో భారీగా మోసగించారని ఆరోపిస్తూ బాధితులు బేగంపేట ప్రజావాణిని ఆశ్రయించారు. ఒక్కొక్కరి నుంచి రూ. 25 లక్షల నుంచి ఏకంగా రూ. 95 లక్షల వరకు వసూలు చేసి నకిలీ డాక్యుమెంట్లు అంటగట్టారని బాధితులు వాపోయారు. తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు ఏపీ, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఈ దంపతుల చేతిలో మోసపోయినట్లు వెల్లడించారు. ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల విజయలక్ష్మి బాధితులతో మాట్లాడి, డీజీపీ, ఈడీకి ఫిర్యాదు చేయాలని సూచిస్తూ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
YouTuber Nandana Visa Scam | త్రినేత్ర.న్యూస్ : విదేశాల్లో ఉద్యోగాల పేరుతో సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన ఓ యూట్యూబర్ చేసిన మోసం తాజాగా హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. యూకేలో స్థిరపడిన యూట్యూబర్ నందన, ఆమె భర్త మధుకర్‌పై కోట్ల రూపాయల వీసా మోసం ఆరోపణలు వెల్లువెత్తాయి. జాబ్‌లు, వర్క్ వీసాలు ఇప్పిస్తామంటూ తమ నుంచి భారీగా నగదు వసూలు చేసి నిండా ముంచారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో బాధితులు సోమవారం బేగంపేట ప్రజాభవన్‌లోని సీఎం ప్రజావాణికి తరలివచ్చారు.
నమ్మించి.. నకిలీ పత్రాలు ఇచ్చి..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకే ప్రభుత్వం తమ కన్సల్టెన్సీ కంపెనీకి అధికారికంగా ఉద్యోగులను నియమించుకునే అనుమతి ఇచ్చిందని నందన, ఆమె భర్త నమ్మబలికారు. ముఖ్యంగా స్టూడెంట్ వీసా, విజిటర్ వీసాలపై బ్రిటన్ వెళ్లిన యువతకు వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించారు. ఇందుకోసం ఒక్కో అభ్యర్థి వద్ద నుంచి కనీసం రూ. 25 లక్షల నుంచి గరిష్టంగా రూ. 95 లక్షల వరకు వసూలు చేశారు.
తీరా యూకే వెళ్లాక కన్సల్టెన్సీ అందజేసిన పత్రాలన్నీ నకిలీవని తేలడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ ఉద్యోగం లేక, చేతిలో ఉన్న సొమ్ము పోయి అగమ్యగోచర స్థితిలోకి జారుకున్నారు.
తెలుగు రాష్ట్రాలు సహా గుజరాత్ బాధితులు
ఈ దంపతుల వలలో కేవలం తెలంగాణ యువత మాత్రమే కాదు.. ఇతర రాష్ట్రాల ప్రజలూ చిక్కుకున్నారు. తెలంగాణలోని వికారాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు కూడా మోసపోయిన వారిలో ఉన్నట్లు బాధితులు తెలిపారు.
ప్రజావాణి భరోసా.. ఈడీ, డీజీపీకి ఫిర్యాదుకు సూచన
బేగంపేట ప్రజాభవన్‌లో ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల విజయలక్ష్మి, అధికారులు విద్యాసాగర్, డాక్టర్ వినోద్ కుమార్‌లను బాధితులు నేరుగా కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కష్టపడి సంపాదించిన కోట్ల రూపాయలను నందన దంపతులు కొల్లగొట్టారని, తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన ప్రజావాణి అధికారులు.. ఈ మోసంపై రాష్ట్ర డీజీపీ (DGP)తో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
- ●Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
- ●Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..
- ●Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- ●KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?
- ●టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..

Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?



