త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court | గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్ష‌పై తీర్పు వాయిదా.. వ‌చ్చే నెల 5న వెల్ల‌డిస్తామ‌న్న హైకోర్టు

High Court | గ్రూప్‌-1 మెయిన్స్ (Group 1 mains) ప‌రీక్ష‌పై తీర్పును హైకోర్టు (High Court) వాయిదా వేసింది. మెయిన్స్ ప‌రీక్ష‌కు సంబంధించిన ప‌త్రాల మూల్యాంక‌నంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, దీనిపై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం గురువారం తీర్పు ఇవ్వాల్సి ఉన్న‌ది.

G

Telangana | Published On Jan 22, 2026, 11.30 am IST

High Court | గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్ష‌పై తీర్పు వాయిదా.. వ‌చ్చే నెల 5న వెల్ల‌డిస్తామ‌న్న హైకోర్టు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: గ్రూప్‌-1 మెయిన్స్ (Group 1 mains) ప‌రీక్ష‌పై తీర్పును హైకోర్టు (High Court) వాయిదా వేసింది. మెయిన్స్ ప‌రీక్ష‌కు సంబంధించిన ప‌త్రాల మూల్యాంక‌నంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని, దీనిపై న్యాయ‌విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం గురువారం తీర్పు ఇవ్వాల్సి ఉన్న‌ది. అయితే తీర్పు ఇంకా సిద్ధం కాలేదంటూ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అప‌రేశ్ కుమార్ సింగ్‌, జ‌స్టిస్ జీఎం. మొహియుద్దీన్ ధ‌ర్మాస‌నం వాయిదా వేసింది. ఫిబ్ర‌వ‌రి 5న తీర్పును వెలువ‌రిస్తామ‌ని వెల్ల‌డిచింది. కాగా, గ‌త నెల‌లోనే ఈ పిటిష‌న్ల‌పై తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు.. నేటికి వాయిదా వేసింది. ఈ తీర్పుపైనే అప్పాయింట్‌మెంట్ లెట‌ర్లు అందుకున్న 563 మంది అభ్య‌ర్థుల భ‌విత‌వ్యం ముడిప‌డి ఉన్న‌ది.

2024 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు టీజీపీఎస్సీ గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన జ‌వాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జ‌రిగాయ‌ని, మ‌ళ్లీ ప‌రీక్ష‌ను నిర్వ‌హించాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన కే.పరుశరాములుతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. మార్చి 10న వెలువరించిన తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను రద్దు చేశారు. జ‌వాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని ఆదేశించారు. అలాకాని పక్షంలో మెయిన్స్‌ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.

అయితే సింగిల్ జ‌డ్జి ఆదేశాలను టీజీపీఎస్సీతో పాటు ఉద్యోగాల‌కు ఎంపికైన‌ పలువురు అభ్యర్థులు డివిజ‌న్ బెంచ్ ముందు స‌వాల్ చేశారు. దీంతో సీజే ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement