త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court | సీనియ‌ర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైద‌రాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం

High Court | సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఆర్థికశాఖ ప్రధానకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాపై (Sandeep Kumar Sultania) హైకోర్టు (High Court) అరెస్టు వారంట్ జారీచేసింది. ఆయన ఎక్క‌డ ఉన్నా అరెస్టు చేసి ఆగస్టు 7న ఉదయం 10.30 గంటలకు కోర్టు ఎదుట హాజరుపరచాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ను (Hyderabad CP) ఆదేశించింది.

G

Telangana | Published On Aug 7, 2026, 6.20 am IST

High Court | సీనియ‌ర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైద‌రాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం
Advertisement

High Court | త్రినేత్ర‌.న్యూస్‌: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఆర్థికశాఖ ప్రధానకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాపై (Sandeep Kumar Sultania) హైకోర్టు (High Court) అరెస్టు వారంట్ జారీచేసింది. ఆయన ఎక్క‌డ ఉన్నా అరెస్టు చేసి ఆగస్టు 7న ఉదయం 10.30 గంటలకు కోర్టు ఎదుట హాజరుపరచాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ను (Hyderabad CP) ఆదేశించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన నిధుల జాప్యంపై న‌మోదైన కేసులో కోర్టు పూర్వ ఆదేశాల‌ను బేఖాత‌రు చేసినందుకుగాను ఆయ‌న‌పై కోర్టు ధిక్క‌ర‌ణ (Contempt of Court) చ‌ర్య‌ల కింద అరెస్టు వారెంట్ (Arrest Warrant) జారీచేసింది. కోర్టు ఇచ్చిన స్ప‌ష్ట‌మైన ఉత్త‌ర్వుల‌ను లెక్క‌చేయ‌కుండా ప్ర‌వ‌ర్తించిన ఆయ‌న‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

ఒకవేళ స‌ద‌రు అధికారి తాను స్వ‌చ్ఛందంగా కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతాన‌ని స్ప‌ష్ట‌మైన హామీ ఇస్తే రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయవచ్చని కూడా న్యాయస్థానం (Bail) స్పష్టంచేసింది. అనంతరం కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విచారణకు హాజరవుతూ ఉండాలని పేరొంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత జే రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధికార పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

2024లో రామకృష్ణ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, కంటోన్మెంట్‌ బోర్డు (Cantonment Board) నుంచి వసూలు చేసిన సర్‌చార్జ్‌ ఆన్‌ స్టాంప్‌డ్యూటీ బకాయిలు రూ.33.12 కోట్లు విడుదల చేయాలన్న ఆయన వినతిని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ రామకృష్ణ 2026 మార్చిలో కోర్టు ధికార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు తొలుత సుల్తానియాకు నోటీసులు జారీ చేసి.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టంచేసింది. అయితే సుల్తానియా కౌంటర్‌ దాఖలు చేయకపోగా.. ఆయన తరఫున ఎవరూ కోర్టుకు కూడా హాజరు కాలేదు. దీనిని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. దీంతో సుల్తానియా వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీచేసింది. జూలై 10న కేసు మరోసారి విచారణకు రాగా, ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం కోరారు. అయితే ఇప్పటికే తగిన అవకాశాలు ఇచ్చినా కౌంటర్‌ దాఖలు చేయలేదని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఎలాంటి పిటిషన్‌ కూడా దాఖలు కాలేదని కోర్టు పేరొంది. అదనపు గడువు ఇవ్వడానికి నిరాకరిస్తూ సుల్తానియాపై బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీచేసింది.

 

Advertisement
Advertisement