Harish Rao | కష్టపడే వారికి వారికి చేయూత అందిస్తా.. : హరీశ్ రావు
Harish Rao | కష్టపడి వ్యాపారం చేసుకొనే వారికి ఎల్లప్పుడూ తన ప్రోత్సాహం ఉంటుందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మీ కష్టానికి తోడుగా.. తన వంతు సాయంగా.. చేయూత అందిస్తానని చెప్పారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: కష్టపడి వ్యాపారం చేసుకొనే వారికి ఎల్లప్పుడూ తన ప్రోత్సాహం ఉంటుందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మీ కష్టానికి తోడుగా.. తన వంతు సాయంగా.. చేయూత అందిస్తానని చెప్పారు. సిద్దిపేట (Siddipet) నియోజకవర్గంలోని 5 మండల్లాల్లో రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్‌ను (Tea Stall) హరీశ్ రావు పంపిణీ చేశారు. నెక్ (NECC) వారి సహకారంతో చాయ్ బండితోపాటు గ్యాస్ సిలిండర్, స్టవ్, ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లు, స్పూన్లు, ప్లేట్లు, తదుతర సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ హోటళ్లు నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి మరింత ఊతమిచ్చేందుకు నెక్ సహకారంతో నియోజకవర్గంలోని ఐదు మండలాల వారికి టీ స్టాల్స్‌ను పంపిణీ చేశామన్నారు. టీ స్టాల్ ఒక వ్యాపారమే కాదని, కుటుంబానికి జీవనాధారమని చెప్పారు. ఇది కష్టపడి పనిచేసే వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గమని వెల్లడించారు. ఈ వ్యాపారంలో మంచి లాభాలు చేకూరాలని ఆకాంక్షించారు. దీనికి సంబంధించిన తాజాగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

సిద్దిపేట నియోజకవర్గంలో హోటల్స్ నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి మరింత ఊతం ఇచ్చేందుకు నా వంతు సహాయంగా NECC వారి సహాయంతో మొత్తం 72 లక్షల రూపాయలతో 91 టీ స్టాల్స్ ను అందజేసిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు. pic.twitter.com/KtsLPZLCRV
— Office of Harish Rao (@HarishRaoOffice) July 6, 2026
తాజావార్తలు
- ●Monsoon | బలహీనంగానే నైరుతి రుతుపవనాలు.. ధరల పెరుగుదలపై పెరుగుతున్న ఆందోళన
- ●Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్
- ●Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
- ●Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
- ●Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
- ●Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా

Monsoon | బలహీనంగానే నైరుతి రుతుపవనాలు.. ధరల పెరుగుదలపై పెరుగుతున్న ఆందోళన

Allu Arjun | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త

Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో






