Traffic Jam | 8 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న వ్యాపారవేత్త.. ఉన్నచోటుకే హెలికాప్టర్‌ను రప్పించుకొని
Traffic Jam | ఎకా మొబిలిటీ సంస్థ చైర్మన్ డాక్టర్ సుధీర్ మెహతా దాదాపు ఎనిమిది గంటలపాటూ ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అయితే, చివరికి చేసేదేమీ లేక ఉన్నపలంగా హెలికాప్టర్ బుక్ చేసుకుని ట్రాఫిక్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
Traffic Jam | ముంబై- పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై 30 గంటలకుపైగా ట్రాఫిక్ (Mumbai-Pune Expressway) నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఓ గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడటంతో 20 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. దీంతో సామాన్య ప్రజలతోపాటూ బడా వ్యాపారులు, ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఎటూ వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఓ వ్యాపారవేత్త మాత్రం హెలికాప్టర్ బుక్ చేసుకుని ట్రాఫిక్ నుంచి బయటడిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఎగ్జిట్ పాయింట్లు పెట్టాలి..
ఎకా మొబిలిటీ సంస్థ చైర్మన్ డాక్టర్ సుధీర్ మెహతా దాదాపు ఎనిమిది గంటలపాటూ ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అయితే, చివరికి చేసేదేమీ లేక ఉన్నపలంగా హెలికాప్టర్ బుక్ చేసుకుని ట్రాఫిక్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా గగనతలం నుంచి ట్రాఫిక్ పరిస్థితిని ఫొటోల రూపంలో ఎక్స్‌లో పోస్టు చేశారు. ఒక్క గ్యాస్ ట్యాంకర్ కారణంగా వేలాది మంది ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఎదురయ్యే సంక్షోభాలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ కారిడార్ల వద్ద అత్యవసర ఎగ్జిట్‌లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెనక్కి వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్‌వేలపై ఎగ్జిట్ పాయింట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆయా మార్గాల్లో హెలిప్యాడ్‌లను కూడా నిర్మిస్తే బాగుంటుందన్నారు. అందుకు రూ.10 లక్షల కంటే తక్కువే ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
https://x.com/sudhirmehtapune/status/2018981445835088133
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






