Revanth Reddy | సాధారణ ట్రాఫిక్‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ కాన్వాయ్
Revanth Reddy | ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే పయనించారు. తన కాన్వాయ్ (CM Convoy) కోసం నగరంలో వాహనాలను నిలిపివేయడంపై పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్‌లోనే పయనించారు. తన కాన్వాయ్ (CM Convoy) కోసం నగరంలో వాహనాలను నిలిపివేయడంపై పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్‌లో వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు.

బుధవారం (మే 6న) ఉదయం 10 గంటల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పైనుంచి ప్రయాణిస్తున్న క్రమంలో అవతలివైపు సైతం వాహనాలను ఆపివేసిన విషయాన్ని సీఎం గుర్తించారు. తన కాన్వాయ్ వెళ్లే మార్గంలో వాహనాలను ఆపడంతోనే ట్రాఫిక్ రద్దీ నెలకొనగా.. అవతలివైపు సైతం ట్రాఫిక్‌ను ఆపేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలోనే తన కాన్వాయ్ గురించి సాధారణ ప్రజల రాకపోకలను ఎక్కువసేపు ఆపి ఇబ్బందులకు గురిచేయొద్దని ఆదేశించారు. ఇతర వాహనదారుల ఇబ్బందుల్ని వీలైనంతమేర తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. దీనికితోడు కొద్దిరోజుల క్రితం బాహ్యవలయ రహదారిపై సీఎం కాన్వాయ్ ప్రయాణించిన సమయంలో రాకపోకల్ని నియంత్రించడంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగడం.. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలోనే బుధవారం తన కాన్వాయ్ మార్గంలో కాకుండా అవతలివైపు సైతం వాహనాల్ని నిలిపివేయడంతో సీఎం అసహనానికి గురయ్యారు. వెంటనే డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్‌చేసి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తన కాన్వాయ్ కోసం సాధారణ ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలపవద్దని.. అలాంటి చర్యలు పునరావృతమైతే సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
[video width="848" height="478" mp4="https://www.trinethra.news/static-media/wp-content/uploads/2026/05/WhatsApp-Video-2026-05-07-at-2.18.26-PM.mp4"][/video]
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



