Heavy Rains | ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
Heavy Rains | ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కొనసాగుతున్నాయి. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains | త్రినేత్ర.న్యూస్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కొనసాగుతున్నాయి. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డితోపాటు వికారాబాద్ జిల్లాల్లోనూ అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు (Orange Alert) జారీ చేసింది.
ఈ జిల్లాల్లాల్లో భారీ వర్షాలు..
అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తేకపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరో మూడు గంటల్లో హైదరాబాద్‌లో (Hyderabad) వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు హనుమకొండ జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతుంది.
తాజావార్తలు
- ●Ramayana | విజువల్ వండర్ రామాయణ ట్రైలర్.. మీరూ చూసేయండి
- ●Horoscope | జూలై 30 రాశిఫలాలు.. ఈ రాశివారికి అనవసర ఖర్చులు ఉంటాయి!
- ●Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
- ●RAAKA | బన్నీ అభిమానులకు గుడ్న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!

Ramayana | విజువల్ వండర్ రామాయణ ట్రైలర్.. మీరూ చూసేయండి

Horoscope | జూలై 30 రాశిఫలాలు.. ఈ రాశివారికి అనవసర ఖర్చులు ఉంటాయి!

Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!

RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ





