త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Heavy Rains | తెలంగాణ‌లో రాగ‌ల నాలుగురోజులు భారీ వ‌ర్షాలు.. ఎల్లో హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ఐఎండీ

TG Heavy Rains | తెలంగాణ‌లో రాగ‌ల మూడునాలుగు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

P

Telangana | Published On Jun 21, 2026, 8.01 pm IST

TG Heavy Rains | తెలంగాణ‌లో రాగ‌ల నాలుగురోజులు భారీ వ‌ర్షాలు.. ఎల్లో హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ఐఎండీ
Advertisement

TG Heavy Rains | తెలంగాణ‌లో రాగ‌ల మూడునాలుగు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

సోమ‌వారం మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, మ‌హ‌బూబాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ప‌లుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని చెప్పింది. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, న‌ల్గొండ‌, భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. బుధ‌వారం ఆదిలాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌య‌శంక‌ర్‌, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట జిల్లాల్లో భారీ ఈదురుగాలులు కూడిన వాన‌లు కురిసే ఛాన్స్ ఉంద‌ని చెప్పింది. గురువారం నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, ములుగు, న‌ల్గొండ‌, కొత్త‌గూడెం, వికారాబాద్‌, మెద‌క్‌, సంగారెడ్డి, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, జోగులాంబ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వివ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement