Malavika Mohanan | యాక్షన్ పాత్రలపై మాళవిక మోహనన్ ఆసక్తి.. మహిళా దర్శకులపై కీలక వ్యాఖ్యలు..!
Malavika Mohanan | తెరపై అందంతో ఆకట్టుకున్న కథానాయికలు.. తమ ప్రతిభను చాటుకునేందుకు విభిన్నమైన పాత్రల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ప్రయత్నంలోనే ఉన్నానంటోంది మాళవిక మోహనన్. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, మహిళలను శక్తిమంతంగా చూపించే యాక్షన్ కథల్లో నటించాలని ఉందని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.
Entertainment | Published On Jul 29, 2026, 6.30 pm IST
Malavika Mohanan | తెరపై అందంతో ఆకట్టుకున్న కథానాయికలు.. తమ ప్రతిభను చాటుకునేందుకు విభిన్నమైన పాత్రల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి ప్రయత్నంలోనే ఉన్నానంటోంది మాళవిక మోహనన్. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, మహిళలను శక్తిమంతంగా చూపించే యాక్షన్ కథల్లో నటించాలని ఉందని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది. అయితే అలాంటి పాత్రలు మరింతగా రావాలంటే సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు, రచయితల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తమిళ, మలయాళ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాళవిక.. ఇటీవల ప్రభాస్ సరసన ది రాజా సాబ్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టులేకపోయింది. ప్రస్తుతం తమిళం, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాళవిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం కొత్త తరహా పాత్రలపై దృష్టి సారించిన మాళవిక, మహిళా ప్రధాన యాక్షన్ చిత్రాల్లో నటించాలనే తన కోరికను వ్యక్తం చేసింది. ‘సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు, రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. సినిమాల్లో మహిళల దృష్టికోణం మరింత బలంగా ప్రతిబింబించాలి. మహిళా దర్శకుల సంఖ్య పెరిగితేనే హీరోయిన్ల కోసం అద్భుతమైన యాక్షన్ పాత్రలు, భిన్నమైన కథలు పుట్టుకొస్తాయి’ అని మాళవిక పేర్కొంది. హాలీవుడ్ చిత్రం కిల్ బిల్ తరహాలో సాగే యాక్షన్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని ఉందని కూడా ఆమె తెలిపింది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ కోణంలో కనిపించిన తనను, ఇకపై నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని చెప్పింది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కుమార్తె వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది మాళవిక. 2013లో మలయాళ చిత్రం పట్టం పోలేతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తమిళంలో రజనీకాంత్ నటించిన పెట్టా, విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన మాస్టర్, ధనుష్ నటించిన మారన్, విక్రమ్ ప్రధాన పాత్రలో వచ్చిన తంగలాన్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. మోడలింగ్ నేపథ్యం నుంచి సినిమాల్లోకి వచ్చిన మాళవిక.. సహజమైన నటన, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో దక్షిణాదిలో మంచి గుర్తింపు పొందింది.
తెలుగులో రాజాసాబ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో కార్తీ సరసన సర్దార్2, పాకెట్ నావల్ మూవీల్లో నటిస్తోంది. అలాగే, తెలుగులో రవితేజ సరసన ఓ మూవీలోనూ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. హసిత్ గోలి దర్శకత్వంలో కామెడీ మల్టీస్టారర్‌లో మాస్ మహరాజ్‌తో జతకట్టనున్నట్లు సమాచారం. ఇందులో మరో హీరోగా శ్రీవిష్ణు నటిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ మూవీలో వీరాధివీరులంట, అక్కాయిలూ.. బాగున్నారా?’ టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ
- ●TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..
- ●National Honour (Amendment) Bill | వందేమాతరం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు
- ●E20 Petrol Impact | ఈ20 పెట్రోల్ వినియోగంపై సందేహాలు.. వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ..!
- ●Google | ఆటోమేటిక్ ఏఐ ఏజెంట్‌ను లాంచ్ చేసిన గూగుల్.. యూజర్ల పనులన్నీ వేగంగా పూర్తి చేస్తుంది..
- ●AK47 | 'ఆదర్శ కుటుంబం'లో వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి.. నవ్వులు పంచుతున్న గ్లింప్స్..!

Konda Surekha | పులుల సంరక్షణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : మంత్రి కొండా సురేఖ

TRAI | దూసుకెళ్తున్న టెలికాం రంగం.. దేశంలో 130 కోట్లకు పైగా వైర్లెస్ కనెక్షన్లు..

National Honour (Amendment) Bill | వందేమాతరం బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

E20 Petrol Impact | ఈ20 పెట్రోల్ వినియోగంపై సందేహాలు.. వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి గడ్కరీ..!





