Heat Wave | తెలంగాణలో దంచికొట్టనున్న ఎండలు.. 40 డిగ్రీలకు పైనే..!
Heat Wave | తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 12 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
Heat Wave | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 12 గంటల సమయానికి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఏప్రిల్ 12 నుంచి 22వ తేదీ మధ్యలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా చిన్నారులు, వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఇండ్లకే పరిమితం కావాలన్నారు.
ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం సమయంలో ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. ఇక హైదరాబాద్ నగరంలో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




