Ponnam Prabhakar | రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ నిర్మాణం.. అట్టహాసంగా ప్రారంభించిన మంత్రులు
Ponnam Prabhakar | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్క్ (టెంపుల్ ట్యాంక్ బండ్)ను సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్, మేడిపల్లి సత్యంతో కలిసి గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించినట్లు తెలిపారు.
- భక్తుల కోసం వాకింగ్ ట్రాక్, కోబుల్ స్టోన్ ఫ్లోరింగ్ ఏర్పాటు
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్క్ (టెంపుల్ ట్యాంక్ బండ్)ను సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్, మేడిపల్లి సత్యంతో కలిసి గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ. 12 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. అనంతరం రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేములవాడ లోని భీమేశ్వర స్వామి ఆలయంలో సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి వరుణ యాగం చేసినట్లు మంత్రి పొన్నం తెలిపారు.



భారీ మహాశివుడి విగ్రహం..
ఈ పార్క్లో పర్యాటకులను ఆకట్టుకునేలా 40 అడుగుల ఎత్తయిన భారీ మహాశివుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. శివుని విగ్రహంతో పాటు సప్తమాత్రికల విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నటరాజ్ విగ్రహ ఫౌంటెన్, సూర్య నమస్కార్ పాయింట్, ల్యాండ్ స్కేపింగ్, ఓపెన్ యాంఫి థియేటర్ నిర్మించారు. భక్తులు, స్థానికుల కోసం వాకింగ్ ట్రాక్, కోబుల్ స్టోన్ ఫ్లోరింగ్ అందుబాటులోకి తెచ్చారు.


త్వరలో బోటింగ్...
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే ఇక్కడ బోటింగ్ సదుపాయాన్ని కూడా ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. వేములవాడకు వచ్చే వేలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచడంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ఈ బండ్ పార్క్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

బాసరకు ఎక్స్ప్రెస్ బస్సు ప్రారంభం..
అనంతరం వేములవాడ బస్ స్టేషన్ ఆధునీకరణకు సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేసినట్లు మంత్రి ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా వేములవాడ కోరుట్ల మీదుగా బాసరకు ఎక్స్ ప్రెస్ బస్సును ప్రారంభించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బాంబు పేలుడు వల్లనే మేడిగడ్డ పిల్లర్ కుంగింది: ఆర్ఎస్ ప్రవీణ్
అక్టోబర్ 16, 2026

Automated Testing Stations | రూ.425.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు
అక్టోబర్ 16, 2026

Ponnam Prabhakar | భూములు విక్రయించైనా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..
- ●RS Praveen Kumar | బాంబు పేలుడు వల్లనే మేడిగడ్డ పిల్లర్ కుంగింది: ఆర్ఎస్ ప్రవీణ్
- ●Rajnath Singh | బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర : రాజ్నాథ్ సింగ్
- ●Reliance Industries | స్టార్లింక్కు స్వాగతం.. పోటీకి భయపడం: రిలయన్స్
- ●Madhu Yaskhi Goud | రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న మోదీ సర్కార్: మధుయాష్కి గౌడ్
- ●Special Parliament Session | నెలాఖరులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు..? మళ్లీ తెరపైకి డీలిమిటేషన్, మహిళా బిల్లులు

Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..

RS Praveen Kumar | బాంబు పేలుడు వల్లనే మేడిగడ్డ పిల్లర్ కుంగింది: ఆర్ఎస్ ప్రవీణ్

Rajnath Singh | బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర : రాజ్నాథ్ సింగ్

Reliance Industries | స్టార్లింక్కు స్వాగతం.. పోటీకి భయపడం: రిలయన్స్



