త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ఎస్సీ యువ‌త‌కు ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు.. స‌బ్సిడీపై టూ, త్రీ వీల‌ర్స్‌

Telangana | రాష్ట్రంలో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం (Telangana Govt) ముందుకు వెళ్తున్న‌ది. ఇందులో భాగంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నిరుద్యోగ యువ‌త‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పిచ‌డానికి స‌బ్సిడీపై ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు (Electric Vehicles) అందించాల‌ని నిర్ణ‌యించింది.

G

Telangana | Published On Jul 30, 2026, 10.50 am IST

Telangana | ఎస్సీ యువ‌త‌కు ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు.. స‌బ్సిడీపై టూ, త్రీ వీల‌ర్స్‌
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం (Telangana Govt) ముందుకు వెళ్తున్న‌ది. ఇందులో భాగంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నిరుద్యోగ యువ‌త‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పిచ‌డానికి స‌బ్సిడీపై ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు (Electric Vehicles) అందించాల‌ని నిర్ణ‌యించింది. ఎస్సీ కార్పొరేష‌న్ (SC Corporation) ద్వారా ద్వి, త్రి చ‌క్ర వాహ‌నాల‌ను పంపిణీ చేయ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,016 టూ వీల‌ర్, 2,508 త్రీ వీల‌ర్స్ మొత్తం 7,500 వాహనాలు పంపిణీ చేయాలని.. ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు స‌మాచారం. దీనికోసం రూ.125.40 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్న‌ద‌ని.

స‌బ్సిడీ ఇలా..

రూ.ల‌క్ష లోపు ద్విచ‌క్ర వాహ‌నాల‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 90 శాతం స‌బ్సిడీ (Subsidy) ఇవ్వ‌నుండ‌గా, మిగిలిన 10 శాతం ల‌బ్దిదారుల‌కు బ్యాంక్ లోన్ మంజూరు కానుంది. అదేవిధంగా రూ.4 ల‌క్ష‌ల లోపు ఉన్న త్రీ వీల‌ర్‌ల‌కు 70 శాతం స‌బ్సిడీ, 30 శాతం బ్యాంక్ లోన్ ఇవ్వ‌నున్నారు.

దీనికోసం అన్ని జిల్లాల్లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఎస్సీ కార్పొరేషన్ ఎండీ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, వీటికిగాను లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వాటిని ప‌రిశీలించి జిల్లా క‌లెక్ట‌ర్ నేతృత్వంలోని క‌మిటీ ల‌బ్దిదారుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఈ క‌మిటీలో అద‌న‌పు క‌లెక్ట‌ర్‌, ఎస్సీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌, బ్యాంకు మేనేజ‌ర్‌, ర‌వాణా, వ్య‌వ‌సాయం, విద్యుత్ శాఖ‌ల నుంచి ఒక అధికారి స‌భ్యులుగా ఉన్నారు.

 

Advertisement
Advertisement