త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hate Speech Bill | ప్ర‌జాస్వామ్యానికి డెత్ వారెంట్.. శాస‌న‌స‌భ‌లో హేట్ స్పీచ్ బిల్లు

Hate Speech Bill | తెలంగాణ రాష్ట్ర‌ప్ర‌భుత్వం తాజాగా రూపొందించిన తెలంగాణ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాలను (నివారించు) చట్టము 2026ను శాస‌న‌స‌భ‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌వేశ‌పెట్టారు.

S

Telangana | Published On Mar 30, 2026, 8.00 pm IST

Hate Speech Bill | ప్ర‌జాస్వామ్యానికి డెత్ వారెంట్.. శాస‌న‌స‌భ‌లో హేట్ స్పీచ్ బిల్లు
Advertisement

తీవ్రంగా వ్య‌తిరేకించిన బీజేపీ, సీపీఐ, ఎంఐఎం
ఉండాల్సిందేన‌న్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఎవ‌రినైనా జైలుకు పంప‌వ‌చ్చు
అధికారుల‌కు అప‌రిమిత అధికారాలు
త‌ప్పుడు కేసులు న‌మోదు చేసినా వారిపై నో యాక్ష‌న్‌

Hate Speech Bill | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర‌ప్ర‌భుత్వం తాజాగా రూపొందించిన తెలంగాణ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాలను (నివారించు) చట్టము 2026ను శాస‌న‌స‌భ‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ చ‌ట్టం ప్ర‌కారం ఎవ‌రిపైనైనా విరోధము, ద్వేషము కలిగించే విద్వేషపూరితమైన ప్రసంగము చేసిన వారు శిక్షార్హులు. దాంతో పాటు దానిని ప్ర‌సారం చేసిన‌వారు, ప్ర‌చురించిన‌వారు, ప్ర‌చారం చేసిన‌వారు, ప్రోత్స‌హించిన‌వారు సైతం శిక్షార్హులే. నేరం రుజువైతే క‌నీసం సంవ‌త్స‌రం నుంచి ఏడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష‌తో పాటు రూ.50 వేలు జ‌రిమానా విధించ‌వ‌చ్చు. ఇదే త‌ప్పు పున‌రావృతం చేస్తే క‌నీసం రెండేళ్ల నుంచి ప‌దేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష‌, రూ.ల‌క్ష జ‌రిమానా విధిస్తారు. ఈ కేసుల్లో బాధితుల‌కు న్యాయ‌మూర్తి నిందితుల నుంచి న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించే అవ‌కాశం కూడా కల్పించారు. నూత‌న చ‌ట్టం ప్ర‌కారం త‌హ‌శీల్దార్, ఆ పై స్థాయి అధికారులు త‌మ‌కు వ‌చ్చిన ఫిర్యాదును ప‌రిశీలించి, చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. ఏదైనా ఒక సంస్థ నేరం చేసిన‌ట్లైతే ఆ సంస్థ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే ప్ర‌తీ వ్య‌క్తి అందుకు బాధ్యులే అవుతారు. ఎవరైనా వ్యక్తి తనకు తెలియకుండా నేరం జరిగిందని లేక అట్టి నేరం జరుగకుండా నివారించుటకు తాను తగినంత జాగ్రత్త తీసుకున్నానని నిరూపించినచో అటువంటి వారిని మిన‌హాయించ‌వ‌చ్చు. ఈ చట్టము, లేక దాని క్రింద చేసిన నియమాల క్రింద ప్రభుత్వ ఉద్యోగులు ఏ చ‌ర్యలు తీసుకున్నా వారిపై ఎటువంటి దావా, విచార‌ణ‌, ఇత‌ర న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్ట‌రాద‌నేది స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ఈ బిల్లుపై ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు భ‌గ్గుమ‌న్నారు.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా డిజిటల్, సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్వేష పూరితమైన ప్రసంగం, ద్వేషపూరితమైన నేరాల సంఘటనలు గణనీయంగా పెరిగాయ‌ని మంత్రి పొన్నం చెప్పారు. ఇవి వేగంగా వ్యాపిస్తూ, ప్రజా శాంతి, సామాజిక సామరస్యానికి న‌ష్టం చేకూరుస్తాయ‌ని అన్నారు. మతం, కులం, జాతి, లింగం, భాష, ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు, సమూహాల మధ్య శతృత్వం, ద్వేషం మరియు విభేదాలను ప్రోత్సహిస్తూ, సమానత్వం, గౌరవం మరియు సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టపరమైన వ్యవస్థ, విద్వేషపూరితమైన ప్రసంగం, ద్వేష పూరితమైన నేరాల ప్రవర్తనను సమర్ధవంతంగా నివారించ‌లేక‌పోతుంద‌ని చెప్పారు. వాటిని నియంత్రించేందుకు, నేర‌స్థుల‌ను శిక్షించేందుకు, బాధితుల‌కు ప‌రిహారం అందించేందుకు ప్రత్యేక, పటిష్ట చ‌ట్టం అవస‌ర‌ముంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement