త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్: హ‌రీశ్ రావు

Harish Rao | కేసీఆర్ దీక్షాబ‌లం, అమ‌రుల త్యాగ‌ఫ‌లం తెలంగాణ రాష్ట్ర‌మ‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) చేప‌ట్టిన‌ నిరాహార దీక్ష (Hunger Strike) చరిత్ర గతిని మార్చింద‌ని, అది తరతరాల తెలంగాణ (Telangana) ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు.

G

Telangana | Published On Nov 29, 2026, 9.29 am IST

Harish Rao | భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: కేసీఆర్ దీక్షాబ‌లం, అమ‌రుల త్యాగ‌ఫ‌లం తెలంగాణ రాష్ట్ర‌మ‌ని బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) చేప‌ట్టిన‌ నిరాహార దీక్ష (Hunger Strike) చరిత్ర గతిని మార్చింద‌ని, అది తరతరాల తెలంగాణ (Telangana) ఆకాంక్షను నెరవేర్చిందని చెప్పారు. నిన్నైనా నేడైనా రేపైనా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని వెల్ల‌డించారు.

ఆత్మబలమే ఆయుధంగా, వాక్ శక్తే ఇంధనంగా, నిజాయితీ నిబద్దతలే కవచ కుండలాలుగా తెలంగాణ పోరాటాన్ని విజయతీరం చేర్చిన యోధుడు కేసీఆర్ అని చెప్పారు. పదవులు వదిలి ప్రజలను ఒక్కటి చేశార‌ని, ప్రాణాన్నే పణంగా పెట్టి ఢిల్లీ గద్దెను వణికించార‌ని తెలిపారు. అర్ధ శతాబ్దపు ఆకాంక్షను సాకారం చేసి తెలంగాణను ఆవిష్కరించార‌ని పేర్కొన్నారు.

`భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్
స్వరాష్ట్రంలో సుపరిపాలన చేసిన ప్రగతి సంతకం కేసీఆర్
భవిష్యత్ తరాలలో సైతం స్పూర్తిని వెలిగించే ఉద్యమ పాఠం కేసీఆర్
కేసీఆర్ అంటే తెలంగాణ గర్వం..
కేసీఆర్‌కు తెలంగాణే సర్వం..` అని హ‌రీశ్ రావు ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు.

 

Advertisement
Advertisement