త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jharkhand | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆల‌యానికి వెళ్తూ 13 మంది దుర్మ‌ర‌ణం

Jharkhand  | జార్ఖండ్‌లోని రాంచీ-ప‌ట్నా జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Jharkhand) జ‌రిగింది. దైవదర్శనానికి వెళ్తున్న‌ భక్తుల వాహనం.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఝ‌ట‌నలో 13 మంది మృతి చెందారు.

G

National | Published On Nov 29, 2026, 8.30 am IST

Jharkhand | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆల‌యానికి వెళ్తూ 13 మంది దుర్మ‌ర‌ణం
Advertisement

Jharkhand  | త్రినేత్ర న్యూస్‌: జార్ఖండ్‌లోని రాంచీ-ప‌ట్నా జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Jharkhand) జ‌రిగింది. దైవదర్శనానికి వెళ్తున్న‌ భక్తుల వాహనం.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఝ‌ట‌నలో 13 మంది మృతి చెందారు. వారిలో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. మరొకరు గాయపడ్డారు.

బీహార్‌లోని (Bihar) నలంద జిల్లా జాంఘారో గ్రామానికి చెందిన 14 మంది స్కార్పియో (Scorpio) వాహనంలో జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌ జిల్లా రాజ్‌రప్పాలో (Rajrappa) ఉన్న ప్ర‌సిద్ధ‌ ఛిన్నమస్తా ఆలయానికి బయల్దేరారు. ఈ క్ర‌మంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంట‌ల స‌మ‌యంలో రాంచీ- పాట్నా హైవేపై పైన్కీ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న వాహనం.. ముందు వెళ్తున్న గుర్తుతెలియ‌ని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కార్పియో ముందుభాగంగా నుజ్జునుజ్జు అయింది. నిద్రలో ఉన్న నిద్ర‌లో మృత్యువ‌డికి చేరుకున్నారు. ఘ‌ట‌నా స్థ‌లంలోనే 13 మంది మ‌ర‌ణించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల స‌హాయంతో మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. గాయ‌ప‌డిన వ్య‌క్తిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. మృతుల్లో న‌లుగురు చిన్నారులు, న‌లుగురు మ‌హిళ‌లు, ఐదుగురు పురుషులు ఉన్నార‌ని రామ్‌గ‌ఢ్ ఎస్‌డీపీఓ అలోక్ రంజ‌న్ తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లంలో ల‌భించిన ప‌త్రాలు, ఆధార్ కార్డుల ఆధారంగా మృతుల‌ను గుర్తించామ‌న్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణ‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement