KTR | నవంబర్ 29 లేకుంటే.. డిసెంబర్ 9 లేదు: కేటీఆర్
KTR | నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. `తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో` అని ప్రతినబూని ఉద్యమ నాయకుడు కేసీఆర్ (KCR) చేపట్టిన మహోన్నత దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పిందని చెప్పారు.
KTR | త్రినేత్ర న్యూస్: నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. `తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో` అని ప్రతినబూని ఉద్యమ నాయకుడు కేసీఆర్ (KCR) చేపట్టిన మహోన్నత దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పిందని చెప్పారు. ఢిల్లీ సర్కార్‌ను గడగడలాడించి, వారి మెడలు వంచిందని తెలిపారు.
తన ప్రాణాలని సైతం లెక్కచేయకుండా కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన దీక్ష తెలంగాణ (Telangana) ఉద్యమంలో ఒక మైలురాయని చెప్పారు. అణచివేయబడ్డ ఒక నేల విముక్తి కోసం ఒక భూమిపుత్రుడు చేసిన పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిలో నిలుస్తుందన్నారు. చావు నోట్లో తలకాయ పెట్టయినా తెలంగాణ రాష్ట్రానికి, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి గుర్తింపు తెస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. మూడున్నర కోట్ల ప్రజల చిరకాల సంకల్పం సాకారం చేశారన్నారు.
`ఒక దీక్ష…
ఒక సంకల్పం…
ఒక రాష్ట్రం!
'తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో' అని ప్రతినబూని ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన మహోన్నత దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది... ఢిల్లీ సర్కార్‌ను గడగడలాడించి, వారి మెడలు వంచింది.
తన ప్రాణాలని సైతం లెక్కచేయకుండా కేసీఆర్ గారు నవంబర్ 29, 2009 నాడు చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయి.
అణిచివేయబడ్డ ఒక నేల విముక్తి కోసం ఒక భూమిపుత్రుడు చేసిన పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లో చిరస్థాయిలో నిలుస్తుంది.
చావు నోట్లో తలకాయ పెట్టైనా తెలంగాణ రాష్ట్రానికి, అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి గుర్తింపు తెస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. మూడున్నర కోట్ల ప్రజల చిరకాల సంకల్పం సాకారం చేశాడు.
నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు.
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు.
జై తెలంగాణ!` అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు

Home Guard Suicide | రైల్వే ట్రాక్‌పై ఛత్రినాక హోంగార్డు ఆత్మహత్య.. మూడు ముక్కలైన బాడీ.. ఈ ఘోరం ఎలా జరిగిందంటే!
నవంబర్ 29, 2026

Sonia Gandhi Movie | సోనియా సినిమాకు దర్శకుడిని ఎంపిక చేసిన జగ్గారెడ్డి.. ఆయన ఎవరంటే!
నవంబర్ 29, 2026

MLA Jagadish Reddy | కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు..
నవంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Shah Rukh Khan | నిమిషానికి యాభై లక్షల సంపాదన.. షారుఖ్ రేంజ్ వేరే లెవెల్
- ●Hemant Soren | కాంగ్రెస్‌కు మరో కోలుకోలేని దెబ్బ.. డీఎంకే బాటలోనే హేమంత్ సొరెన్? ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది?
- ●Sreeleela | ఫ్లాపుల ఎఫెక్ట్ - తెలుగు సినిమా కోసం రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన శ్రీలీల
- ●Mandya Girl Suicide | మావాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోకుంటే బతకవ్.. బాలికకు స్నేహితుల వార్నింగ్.. తర్వాత ఏం చేశారంటే!
- ●MP Eatala Rajender | ఫాక్స్ సాగర్ బాధితులకు అండగా ఉంటా.. హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటల ఫైర్
- ●Sharad Pawar | ముంబైకి ఇండియా కూటమి నేతల పరుగు.. డీలిమిటేషన్ బిల్లుపై శరద్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా?

Shah Rukh Khan | నిమిషానికి యాభై లక్షల సంపాదన.. షారుఖ్ రేంజ్ వేరే లెవెల్

Hemant Soren | కాంగ్రెస్‌కు మరో కోలుకోలేని దెబ్బ.. డీఎంకే బాటలోనే హేమంత్ సొరెన్? ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది?

Sreeleela | ఫ్లాపుల ఎఫెక్ట్ - తెలుగు సినిమా కోసం రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన శ్రీలీల

Mandya Girl Suicide | మావాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోకుంటే బతకవ్.. బాలికకు స్నేహితుల వార్నింగ్.. తర్వాత ఏం చేశారంటే!



