IND Vs NZ Test | రెండోటెస్ట్‌లో నుంచి ఆకాశ్‌దీప్ అవుట్.. సిరాజ్‌కు మళ్లీ మొండి చేయి!
IND Vs NZ Test | న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గాయం కారణంగా పేసర్ ఆకాశ్ దీప్ మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి తీసుకున్నారు. ఈ నిర్ణయమే మరోసారి మహ్మద్ సిరాజ్ ఎంపికపై ప్రశ్నలు రేకెత్తించింది.
- ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు చోటు..
- గంభీర్‌పై వ్యూహాలపై విమర్శలు
IND Vs NZ Test | న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గాయం కారణంగా పేసర్ ఆకాశ్ దీప్ మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి తీసుకున్నారు. ఈ నిర్ణయమే మరోసారి మహ్మద్ సిరాజ్ ఎంపికపై ప్రశ్నలు రేకెత్తించింది. వరుసగా రెండో టెస్టులోనూ తుది జట్టులో చోటు దక్కని సిరాజ్‌కు.. ఆకాశ్ దీప్ స్థానంలోనైనా అవకాశం కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోచ్ గౌతమ్ గంభీర్, టీమ్ మేనేజ్‌మెంట్ సిరాజ్ విషయంలో అనుసరిస్తున్న వైఖరి ఏంటన్న చర్చ మొదలైంది.
సిరాజ్‌కు మరోసారి నిరాశే..
రెండో టెస్టులో భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలని నిర్ణయించింది. దాంతో సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టెస్టులోనూ అతడిని పక్కనపెట్టిన టీమ్ మేనేజ్‌మెంట్.. రెండో టెస్టులోనూ అదే నిర్ణయాన్ని కొనసాగించింది. తాజాగా ఆకాశ్ దీప్ గాయంతో మ్యాచ్‌కు దూరం కావడంతో సిరాజ్‌కు అవకాశం వస్తుందని భావించినా.. మేనేజ్‌మెంట్ మాత్రం ప్రసిద్ధ్ కృష్ణ వైపే మొగ్గుచూపింది. దీంతో సిరాజ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు.
ఆకాశ్ దీప్‌కు గాయం..
రెండో రోజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ వేసిన బౌన్సర్ ఆకాశ్ దీప్ హెల్మెట్‌కు రెండుసార్లు బలంగా తగిలింది. అయినా బ్యాటింగ్ కొనసాగించి భారత ఇన్నింగ్స్‌లో కీలక పరుగులు చేశాడు. అయితే, గాయం తీవ్రత దృష్ట్యా మిగతా మ్యాచ్‌కు అందుబాటులో ఉండలేడని వైద్య బృందం తేల్చింది. దీంతో భారత్ కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌ను కోరగా.. ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనంలో కీలక పాత్ర పోషించిన ఆకాశ్ దీప్ దూరం కావడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బే.
సిరాజ్‌కు అన్యాయం జరుగుతోందా?
ప్రసిద్ధ్ కృష్ణను గతంలో పేలవ ప్రదర్శన కారణంగా తుది జట్టు నుంచి తప్పించినప్పుడు.. అతడి స్థానంలో సిరాజ్‌కు అవకాశం ఇవ్వాల్సిందని కామెంటేటర్ మురళీ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు ఆకాశ్ దీప్ స్థానంలోనూ సిరాజ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇలాంటి నిర్ణయాలు ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించాడు. మరోవైపు ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే సైతం టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై స్పందించాడు. సిరాజ్ ఎంపికకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రస్తుత సైకిల్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న సిరాజ్‌ను వరుసగా పక్కనపెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించాడు.
246 పరుగులకే భారత్ ఆలౌట్..
మరోవైపు రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ పూర్తిగా తడబడింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేయగా.. భారత్ 86.1 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆటను 116/6తో ప్రారంభించిన భారత్.. మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయి మరో 130 పరుగులు మాత్రమే జోడించింది. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం చేశాడు. ఆకాశ్ దీప్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 46 పరుగులు జోడించి ఫాలోఆన్ ముప్పు నుంచి భారత్‌ను గట్టెక్కించాడు. అనంతరం గుర్నూర్ బ్రార్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో బుమ్రాతో కలిసి పదో వికెట్‌కు మరో 19 పరుగులు జోడించాడు. అయితే, 170 బంతుల్లో 14 ఫోర్లతో 88 పరుగులు చేసిన జురెల్‌ను జేమీసన్ పెవిలియన్‌కు పంపడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ బౌలర్లలో జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, జాకబ్ డఫీ రెండేసి వికెట్లు తీశారు.
రెండో రోజే కుప్పకూలిన టాప్ ఆర్డర్
అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 356 పరుగుల వద్ద ముగిసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. దేవదత్ పడిక్కల్ (21), కేఎల్ రాహుల్ (25), శుభ్‌మన్ గిల్ (17), రిషభ్ పంత్ (23), వాషింగ్టన్ సుందర్ (10) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కివీస్ పేసర్ల ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ వరుసగా కుప్పకూలింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌కు విజయం అత్యంత కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు జట్టు ఓటమి ముప్పును ఎదుర్కొంటుండగా.. మరోవైపు సిరాజ్ ఎంపిక చుట్టూ వివాదం మొదలవడం ఆసక్తికరంగా మారింది. అసలు సిరాజ్‌ను వరుసగా పక్కనపెట్టడానికి టీమ్ మేనేజ్‌మెంట్ వద్ద ఉన్న కారణాలేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | నవంబర్ 29 లేకుంటే.. డిసెంబర్ 9 లేదు: కేటీఆర్
- ●Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేస్తోంది.. రేపటి నుంచే బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా..?
- ●CM Ramesh | బీజేపీ ఎంపీ ఇంట్లో దొంగలు.. రూ.18 లక్షలు చోరీ
- ●Harish Rao | భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్: హరీశ్ రావు
- ●Cabinet Expansion | మోదీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం?
- ●Jharkhand | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆలయానికి వెళ్తూ 13 మంది దుర్మరణం

KTR | నవంబర్ 29 లేకుంటే.. డిసెంబర్ 9 లేదు: కేటీఆర్

Himalayan 750 | రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 వచ్చేస్తోంది.. రేపటి నుంచే బుకింగ్స్.. ధర ఎంతో తెలుసా..?

CM Ramesh | బీజేపీ ఎంపీ ఇంట్లో దొంగలు.. రూ.18 లక్షలు చోరీ

Harish Rao | భూమి పుత్రుల పోరాట చరిత్రలో చెరగని మూడు అక్షరాలు కేసీఆర్: హరీశ్ రావు





