Harish Rao | ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్ రావు
Harish Rao | కాంగ్రెస్ పాలనలో (Congress Govt) అన్నదాత బతుకే ప్రశ్నార్థకమైందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇది ప్రజా పాలన (Praja Palana) కాదని, రాక్షస పాలన అంటూ మండిపడ్డారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ పాలనలో (Congress Govt) అన్నదాత బతుకే ప్రశ్నార్థకమైందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఇది ప్రజా పాలన (Praja Palana) కాదని, రాక్షస పాలన అంటూ మండిపడ్డారు. మొన్న `నువ్వు ఇంకా సచ్చిపోలేదా?` అంటూ ఓ తహసీల్దార్ అవమానం.. నేడు కరెంట్ గురించి అడిగిన పాపానికి రైతు ముఖంపై ఎస్సై లాఠీ దెబ్బలు.. అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరుసగా రైతన్నపై అమానుషాలు చోటుచేసుకుంటున్నామని చెప్పారు.
అసలేం జరిగిందంటే..

ఇటీవల గజ్వేల్ ఎంఆర్‌వో స్వామి వ్యవహారం మరవకముందే శుక్రవారం మరో దారుణ ఘటన వెలుగు చూసింది. గజ్వేల్‌కు చెందిన బీమరి రవి (35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన పొలంలో పంట సాగు విషయంలో పొరుగువారితో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తనపై ఎస్ఐ మల్లారెడ్డి ఎలాంటి కారణం లేకుండానే దాడి చేశారని, రక్తం వచ్చేలా కొట్టారని బాధితుడు ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే తనపై చేయి చేసుకున్నారని వాపోయారు. పైగా పీకనీకి చేస్తున్నవా వ్యవసాయం? అంటూ అవమానించారని కన్నీటి పర్యంతమయ్యారు.
సంబంధిత వార్తలు

Raja Singh | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్: ఎమ్మెల్యే రాజాసింగ్
అక్టోబర్ 24, 2026

PM Kisan | రైతులకు శుభవార్త.. ఈనెల 30న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
అక్టోబర్ 24, 2026

Farmer Alleges | గజ్వేల్‌లో మరో రైతుకు అవమానం.. ఎస్ఐ మల్లారెడ్డి కొట్టారంటూ రైతు ఆరోపణలు
అక్టోబర్ 23, 2026
తాజావార్తలు
- ●Raja Singh | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్: ఎమ్మెల్యే రాజాసింగ్
- ●Fixed Deposit | ఎఫ్డీ గడువు ముగిసిందా? రెన్యూవల్‌కు ముందు ఈ 5 విషయాలు తప్పక చూడండి!
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తగ్గని అస్థిరత.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
- ●Massive Explosion | అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
- ●Jio Platforms IPO | ముగిసిన జియో ఐపీఓ ఇష్యూ.. అలాట్ అయితే అమ్మాలా..? ఇంకా కొనాలా..?
- ●Veg Only | లోక్‌భవన్‌లో మాంసాహారంపై నిషేధం.. వివాదంలో కేరళ నూతన గవర్నర్

Raja Singh | రాష్ట్రంలో కరువు పరిస్థితులు.. పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్: ఎమ్మెల్యే రాజాసింగ్

Fixed Deposit | ఎఫ్డీ గడువు ముగిసిందా? రెన్యూవల్‌కు ముందు ఈ 5 విషయాలు తప్పక చూడండి!

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో తగ్గని అస్థిరత.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

Massive Explosion | అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి



