త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Kisan | రైతులకు శుభవార్త.. ఈనెల 30న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డ‌బ్బులు

PM KISAN | రైతన్న‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) 24వ విడత డబ్బుల‌ను దీపావ‌ళి పండుగ‌కు ముందే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అక్టోబర్ 30న డ‌బ్బుల‌ను నేరుగా రైతుల (Farmers) ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు వెల్ల‌డించింది.

G

National | Published On Oct 24, 2026, 9.09 am IST

PM Kisan | రైతులకు శుభవార్త.. ఈనెల 30న ఖాతాల్లోకి పీఎం కిసాన్ డ‌బ్బులు
Advertisement

PM Kisan | త్రినేత్ర న్యూస్‌: రైతన్న‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) 24వ విడత డబ్బుల‌ను దీపావ‌ళి పండుగ‌కు ముందే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అక్టోబర్ 30న డ‌బ్బుల‌ను నేరుగా రైతుల (Farmers) ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు వెల్ల‌డించింది. 23వ విడత డబ్బులను జూన్ నెలలో విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈనెల 30న అన్న‌దాత‌ల ఖాతాల్లో రూ.2,000 చొప్పున (24th Instalment) జమ కానున్నాయి. ఈమేర‌కు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక ఖాతా హ్యాండిల్ ద్వారా వెల్ల‌డించింది.

పీఎం స‌మ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం రూ.6,000 పంట పెట్టుబ‌డి సాయంగా (Financial Support) అందిస్తున్న‌ది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) విధానం ద్వారా అన్న‌దాత‌ల‌ ఖాతాల్లోకి పంపుతున్న‌ది. ఈ సాయం వల్ల విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చుల కోసం రైతులు ఇబ్బంది పడకుండా లబ్ధి పొందుతున్నారు. అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియను త‌ప్ప‌నిస‌రిగా పూర్తి చేసి ఉండాలి. బయోమెట్రిక్ లేదా ఓటీపీ ఆధారంగా ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి ఈ విడత డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండటంతో పాటు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సదుపాయం యాక్టివ్‌లో ఉండాలి. వీటితో పాటు భూములకు సంబంధించిన వివరాలు పోర్టల్‌లో సరిగ్గా అప్‌లోడ్ చేసి ఉండాలి. గతేడాది ఇ-కేవైసీ చేయక‌పోవ‌డంతో క‌ర్ణాట‌క‌కు చెందిన‌ సుమారు 6 లక్షల మంది రైతులకు చెల్లింపులు నిలిపివేసింది.

 

Advertisement
Advertisement