Harish Rao | నేతన్న బతికితేనే.. మన చేనేత బతుకుతుంది: హరీశ్ రావు
Harish Rao | చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) సెల్యూట్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా (National Handloom Day) మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) సెల్యూట్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా (National Handloom Day) మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగం అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చెప్పారు. నేతన్న బతికితేనే మన చేనేత బతుకుతుందని వెల్లడించారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల బతుకులు చిద్రమవుతున్నాయని చెప్పారు. తెలంగాణ (Telangana) కోసం పోరాడిన నేతన్నలు నేడు తమ బతుకుల కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వం అమలు చేసిన నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ వంటి పథకాలతో చేనేత రంగానికి ఊపిరి పోస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) హామీలను మరిచి, పథకాలను నిలిపివేసి నేతన్నల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిందని విమర్శించారు. మగ్గాలు మూగబోతున్నాయని, వలసలు.. అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జాతికి బట్ట నేసే చేతులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని హితవుపలికారు. రాజకీయాలకు అతీతంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలన్నారు. నేతన్నకు భరోసా కల్పించాలని, చేనేతకు పునర్వైభవం తీసుకురావాలన్నారు. నేతన్నను కాపాడుకుందాం, చేనేతను బతికించుకుందామని చెప్పారు.
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన




