Varuna Yagam | రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని.. ఆగస్టు 10న వరుణ యాగం
Varuna Yagam | ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మందగించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం (Varuna Yagam) నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్ణయించారు.
Varuna Yagam | త్రినేత్ర.న్యూస్: ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మందగించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం (Varuna Yagam) నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నిర్ణయించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, సిద్ధాంతులు ఆగస్టు 10న వరుణ యాగానికి ముహూర్తంగా నిర్ణయించారు. నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో ఈ యాగం చేపట్టనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
దేశం, రాష్ట్ర ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్‌నినో ప్రభావం తెలంగాణ (Telangana) రాష్ట్రంపై లేకుండా ఉండాలని, ఆకాంక్ష తో వరుణ యాగం నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 10న యాదగిరిగుట్ట దేవస్థాన (YTDA) ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు, అర్చక బృందం సమక్షంలో మహా వరుణయాగం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున, విజయవిహార్ ఆవరణ లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారన్నారు.
ప్రకృతి అనుగ్రహం, సమృద్ధిగా వర్షాలు, కృష్ణా, గోదావరి నదుల జలసంపద పరిపుష్టి, రైతాంగ సంక్షేమం, రాష్ట్ర సుభిక్షం కోసం నిర్వహించబడుతున్న ఈ మహోన్నత వరుణయాగ మహాకార్యక్రమానికి మీరు విచ్చేసి, యాగంలో పాల్గొని, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య ఆశీర్వచనాలను పొంది, ఈ పుణ్యకార్యాన్ని విజయవంతం చేయవలని కోరారు.
తాజావార్తలు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ
- ●Corpus | రూ.1 కోటి సంపాదించాలా.. అయితే ముందు రూ.10 లక్షలు దాటండి.. ఎందుకంటే..?
- ●Komatireddy Rajagopal Reddy | ఖర్చెక్కువవుతుంది.. ఇందిరమ్మ ఇళ్లకిచ్చే నిధులు పెంచాలి

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి

Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ





