HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక
HYDRAA | నిరుద్యోగులకు హైడ్రా (HYDRAA) తీపి కబురు చెప్పింది. డీఆర్ఎఫ్ అసిస్టెంట్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి (Jobs in HYDRAA) దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నది. క్రీడా నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం.
HYDRAA | త్రినేత్ర.న్యూస్: ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న ప్రభుత్వ విభాగం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ-HYDRAA). హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా రక్షించడంతోపాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కోసం ప్రభుత్వం దీనిని ఏర్పాటుచేసింది. అయితే న్యాయసూత్రాలకు విభిన్నంగా వ్యవహరిస్తున్నదంటూ, కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నదంటూ నిత్యం వార్తల్లోనే ఉంటుంది. తాజాగా హైడ్రా చీఫ్ రంగనాథ్‌ను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది కూడా. అయితే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. హైడ్రా తనపని తాను చేసుకుంటూ పోతున్నది.
ఇందులో భాగంగా నిరుద్యోగులకు తీపి కబురు చెబుతూ.. ఉద్యోగాల భర్తీకి (Jobs in HYDRAA) దరఖాస్తులను ఆహ్వానించింది. క్రీడా నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నది. వీటిలో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్ పోస్టులు ఉండగా, మిగిలిన 50 హెవీ వెహికల్స్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 150
అర్హలు: పదో తరగతి ఉత్తీర్ణులై 35 ఏండ్ల లోపు వయస్కులై ఉండాలి. డ్రైవర్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: పూర్తిగా శారీరక సామర్థ్య పరీక్షల (Physical Tests) ఆధారంగానే ఉంటుంది. అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకన్లలో (170 సెకన్లు), 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాలి. వీటితో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్ , 7.2 కేజీల షాట్‌పుట్‌ను 6 మీటర్ల దూరం విసరడం లాంటి భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు.
ఆసక్తి, అర్హత కలిగినవారు నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డు , పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరుకావాలి. ఈ ప్రక్రియను హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9వ తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
సంబంధిత వార్తలు

IDL Lake | కూకట్పల్లి ఐడీఎల్ చెరువులో.. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ‘హైడ్రా’ భగీరథ ప్రయత్నం
సెప్టెంబర్ 9, 2026

సెప్టెంబర్ 7 ( రేపటి ) నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు, తీర్మానాలు
సెప్టెంబర్ 6, 2026

HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన



