Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్‌మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు
Hyderabad | త్రినేత్ర.న్యూస్: గతేడాది వేలంలో గణేశ్ లడ్డూను (Ganesh Laddu) భారీ మొత్తానికి దక్కించుకున్నాడు. దాంతో అక్కడ ధనవంతుడిగా గుర్తింపు పొందాడు. అపార్టుమెంటు వాసులకు లడ్డూ పంచాడు. ఆ పరిచయాలతో పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి.. చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి చెక్కేశాడు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: గతేడాది వేలంలో గణేశ్ లడ్డూను (Ganesh Laddu) భారీ మొత్తానికి దక్కించుకున్నాడు. దాంతో అక్కడ ధనవంతుడిగా గుర్తింపు పొందాడు. అపార్టుమెంటు వాసులకు లడ్డూ పంచాడు. ఆ పరిచయాలతో పలువురి వద్ద డబ్బులు వసూలు చేసి.. చెప్పాపెట్టకుండా అక్కడి నుంచి చెక్కేశాడు. అధిక లాభాల ఆశతో పెట్టుబడిపెట్టి మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం ఏటా వేలంలో గణేశుడి లడ్డూని భారీ ధరకు అమ్మి వార్తల్లో నిలిచే మైహోం భూజలో జరిగింది.
కొండపల్లి గణేశ్ అనే వ్యక్తి మైహోం భూజలో (My Home Bhooja) ఉంటున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో వినాయక ఉత్సవాల సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించగా గణేశ్ రూ.51 లక్షలకు దక్కించుకున్నాడు. దీంతో స్థానికంగా ధనవంతుడనే పేరు తెచ్చుకున్నాడు. వేలంలో దక్కించుకున్న లడ్డూని అపార్టుమెంట్ల సముదాయంలోని నివాసితులకు లడ్డూ పంచాడు. ఈ క్రమంలో బోయిన్‌పల్లి కిరణ్ ద్వారా అందులోనే ఉండే సిల్వియా, ఆమె భర్త శ్రీనివాసరెడ్డితో గణేశ్‌కు పరిచయమైంది.

తాము వ్యాపారం ప్రారంభింస్తున్నామని, అందులో పెట్టుబడి పెడితే నెలకు 6 శాతం చొప్పున లాభం ఇస్తామని వారికి చెప్పారు. దీంతో గణేశ్, కిరణ్ మాటలను నమ్మిన సిల్వియా దంపతులు తొలుత రూ.31 లక్షలు పంపారు. కొన్ని రోజుల తర్వాత లాభం గురించి అడగడంతో వాయిదా వేస్తూ వచ్చారు. అనంతరం ఫోన్లు చేసినా స్పందించకపోయేవారు. ఈక్రమంలో గత ఏప్రిల్‌లో గణేశ్, కిరణ్ ఇద్దరూ మైహోం భూజలోని నివాసాలను చెప్పాపెట్టకుండా ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆరా తీయగా తమలాగే మరికొందర్ని కూడా మోసంచేసినట్లు తేలింది. మొత్తంగా ఐదుగురి నుంచి రూ.3.45 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో (EOW)కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..
- ●RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
- ●Horoscope | సెప్టెంబర్ 10 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది!
- ●KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..
- ●Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు
- ●NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం

Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్

Horoscope | సెప్టెంబర్ 10 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది!

KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..






