Harish Rao | కొండు ప్రతాప్ రావు రచించిన `ఆమె వెతలు` పుస్తకాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
Harish Rao | సీనియర్ జర్నలిస్ట్, రచయిత కొండు ప్రతాప్ రావు (Kondu Pratap Rao) రచించిన 'ఆమె వెతలు` (Ame Vethalu) పుస్తకాన్నిబీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు (Harish Rao) ఆవిష్కరించారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్: సీనియర్ జర్నలిస్ట్, రచయిత కొండు ప్రతాప్ రావు (Kondu Pratap Rao) రచించిన 'ఆమె వెతలు` (Ame Vethalu) పుస్తకాన్నిబీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు (Harish Rao) ఆవిష్కరించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ రకాల వేదనలు, కష్టాలు, వారి మానసిక సంఘర్షణలను ప్రతిబింబించేలా రచించిన ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మహిళల సమస్యలపై కథల రూపంలో పుస్తకాన్ని వెలువరించిన ప్రతాప్ రావును అభినందించారు.
సాహిత్య లోకంలో `శ్రీపార్థి` అనే కలం పేరుతో సుపరిచితులు కొండు ప్రతాప్ రావు. ఆయన ముఖ్యంగా మానవీయ సంబంధాలు, సామాజిక ఇతివృత్తాలు, మహిళల జీవిత విశేషాల చుట్టూ తన కథలను అల్లుతుంటారు. నిత్య జీవితంలో కనిపించే పాత్రలను, సమాజంలోని సున్నితమైన సమస్యలను మరియు మానసిక సంఘర్షణలను తన కథలలో సహజంగా ఆవిష్కరిస్తారు. ఆయన రచనల్లో `కడలి..`, `తాత - మనవడు`, `ఆత్మ`, `తెంచుకున్న బంధం`, `శకునం` వంటి కథలు పాఠకుల ఆదరణ పొందాయి. ఆయన రాసిన అనేక కథలు ప్రముఖ తెలుగు డిజిటల్ సాహిత్య పత్రిక అయిన సంచిక (Sanchika)లో ప్రచురితమయ్యాయి.
సంబంధిత వార్తలు

Harish Rao | తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరు.. మంత్రి ఉత్తమ్‌పై హరీశ్ ఫైర్
అక్టోబర్ 29, 2026

Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ.. ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు: హరీశ్ రావు
అక్టోబర్ 28, 2026

బీఆర్ఎస్ ప్రశ్నల వేళ కేసుల కదలిక.. యాదృచ్ఛికమా? రాజకీయ వ్యూహమా?
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ
- ●ChatGPT | డేంజరస్ ఏఐ.. వైద్య సలహాతో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- ●Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్
- ●Naseeruddin Shah | నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు
- ●Konda Surekha | కేటీఆర్‌ను నొప్పించి ఉంటే చింతిస్తున్నా.. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా: మాజీ మంత్రి కొండా సురేఖ
- ●YouTube | యూట్యూబ్, గూగుల్ సెర్చ్ సేవల్లో అంతరాయం.. వినియోగదారులకు ఇబ్బందులు..

Rahul Gandhi | లాఠీలకు భయపడకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే చలో ఢిల్లీలో పాల్గొనండి : రాహుల్ గాంధీ

ChatGPT | డేంజరస్ ఏఐ.. వైద్య సలహాతో ప్రాణాలు కోల్పోయిన మహిళ..

Eatala Rajender | నిధులు తెచ్చే బాధ్యత నాది.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం చూపండి: ఎంపీ ఈటల రాజేందర్

Naseeruddin Shah | నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన, విధ్వంసకర అర్బన్ నక్సల్ : కిరణ్ రిజుజు



