Harish Rao | తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరు.. మంత్రి ఉత్తమ్‌పై హరీశ్ ఫైర్
Harish Rao | కృష్ణా జలాల (Krishna Water) వినియోగం విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ, తప్పులను కప్పిపుచ్చుకుంటున్నాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | త్రినేత్ర న్యూస్: కృష్ణా జలాల (Krishna Water) వినియోగం విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ, తప్పులను కప్పిపుచ్చుకుంటున్నాడని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ (KRMB) మీటింగ్ ఎజెండాలో పేర్కొన్నది నిజమా? ఉత్తమ్ (Uttam Kumar Reddy) ట్వీట్ నిజమా సమాధానం చెప్పాలని నిలదీశారు. నీళ్ల వినియోగంపై కేఆర్‌ఎంబీకి ఒక లెక్క చెబుతుంటే.. తెలంగాణ ప్రజలకు మీరు మరో లెక్క చెబుతారా అంటూ ధ్వజమెత్తారు. తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవాల నుంచి తప్పించుకోలేరన్నారు.
21వ కేఆర్‌ఎంబీ సమావేశం కోసం ప్రభుత్వం సమర్పించిన అధికారిక అజెండాలో 2026 సెప్టెంబర్ 21 నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ఏకంగా 45.791 టీఎంసీల నీటిని తరలించిందని, కానీ తెలంగాణ (Telangana) ప్రభుత్వం మాత్రం ఎంజీకేఎల్‌ఐఎస్ (MGKLIS) ద్వారా బేసిన్ పరిధిలోని అవసరాల కోసం కేవలం 10.653 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకున్నట్లు అజెండాలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. అధికారిక పత్రాల్లో ఒకలా ఉంటే, మంత్రి మాత్రం అందుకు విరుద్ధంగా మరో లెక్క చెబుతున్నారని, ఈ రెండింటిలో ఏది నిజమో, ఏది తప్పుయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండిటిలో ఏది నిజం?
కేఆర్‌ఎంబీకి ప్రభుత్వమే సమర్పించిన గణాంకాలు నిజమైతే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ట్వీట్లు, ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లే కదా అంటూ మండిపడ్డారు. కేఆర్‌ఎంబీని ఒక రకంగా మభ్యపెడుతూ, తెలంగాణ ప్రజలకు వేరేలా తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మంత్రిపై లేదా అని నిలదీశారు. చరిత్రలో కృష్ణా నీళ్లను అత్యంత తక్కువగా వినియోగించుకున్న ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. నీళ్లను ఒడిసిపట్టకుండా నీటిని కిందికి వదిలేసి ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని తప్పుడు లెక్కలు చెప్పినా వాస్తవాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోలేదని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 29 రాశిఫలాలు.. ఈ రాశివారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం!
- ●NHRC | ఐశ్వర్య మృతిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ
- ●Induja | కేటీఆర్‌పై పోలీసులకు బల్మూర్ వెంకట్ భార్య ఫిర్యాదు
- ●SIR Row | ఇండియా కూటమి ర్యాలీకి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతు
- ●Nirmala Sitharaman | వ్యాపారవేత్తల్లో విషం నింపొద్దు.. టాటా గ్రూప్‌పై రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్
- ●CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: 'ఇన్వెస్ట్ తెలంగాణ' కర్టెన్ రైజర్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఫోకస్!

Horoscope | అక్టోబర్ 29 రాశిఫలాలు.. ఈ రాశివారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం!

NHRC | ఐశ్వర్య మృతిపై స్పందించిన ఎన్హెచ్ఆర్సీ

Induja | కేటీఆర్‌పై పోలీసులకు బల్మూర్ వెంకట్ భార్య ఫిర్యాదు

SIR Row | ఇండియా కూటమి ర్యాలీకి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మద్దతు






