Brahmotsavams | రేపటి నుంచి తిరుపతి గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 27న గరుడ సేవ
Brahmotsavams | కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 31 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరుగనున్నది.
Devotional | Published On May 22, 2026, 5.26 pm IST
Brahmotsavams | కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 31 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరుగనున్నది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ నెల 27న ఉత్సవాల్లో కీలకమైన గరడువ సేవ జరుగనుంది. ఈ సేవను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీతం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
వాహనసేవలు..
23న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. రాత్రి పెద్దశేష వాహనం సేవ ఉంటుంది.
24న ఉదయం చిన్నశేష వాహనసేవ, రాత్రి హంస వాహనసేవ జరుగుతుంది.
25న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనసేవ నిర్వహిస్తారు.
26న కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై నుంచి గోవిందుడు విహరిస్తాడు.
27న ఉదయం మోహినీ అవతారంలో, రాత్రి గరుడవాహనసేవ ఉంటుంది.
28న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనసేవ నిర్వహిస్తారు
29న సూర్యప్రభ వాహనం ఉదయం, రాత్రి చంద్రప్రభ వాహనసేవ ఉంటుంది.
30న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనసేవ జరుగుతుంది.
31న చక్రస్నాన మహోత్సవం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!





