త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dialysis Patients | డయాలసిస్ పేషెంట్లకు అండగా ప్రభుత్వం.. 2,356 మందికి కొత్తగా పెన్షన్లు

Dialysis Patients | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డయాలసిస్ పేషెంట్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక భారాన్ని మోస్తున్న కిడ్నీ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

P

Telangana | Published On May 22, 2026, 4.55 pm IST

Dialysis Patients | డయాలసిస్ పేషెంట్లకు అండగా ప్రభుత్వం.. 2,356 మందికి కొత్తగా పెన్షన్లు
Advertisement

Dialysis Patients | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డయాలసిస్ పేషెంట్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక భారాన్ని మోస్తున్న కిడ్నీ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 4,710 మంది డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో 2,356 మంది కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేసింది. ఈ ఫైల్‌పై మంత్రి సీతక్క సంతకం చేశారు. వచ్చే నెల నుంచే ఈ కొత్త లబ్ధిదారులకు పెన్షన్లు అందనున్నాయి. అలాగే, మరో 488 దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. అర్హత నిర్ధారణ పూర్త‌యిన వెంట‌నే వారికి కూడా పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.

డయాలసిస్ చికిత్స పొందుతున్న రోగులు తరచూ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండటం, మందులు, ప్రయాణ ఖర్చులు పెరగడం, పని చేయలేని స్థితి కారణంగా జీవనోపాధి కోల్పోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.2016 చేయూత పెన్షన్ వారికి కొంత ఆర్థిక ఊరట కలిగిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ డయాలసిస్ పేషెంట్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం మానవీయ కోణంలో చూస్తోందని తెలిపారు. ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న కుటుంబాలకు భరోసాగా నిలవడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజా పాలనలో సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇక రాష్ట్రంలో డయాలసిస్ సేవలను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. గతేడాది 18 కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇటీవల మరో 79 కేంద్రాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా కేవలం 20 నిమిషాల ప్రయాణంలో డయాలసిస్ కేంద్రానికి చేరుకునేలా నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement