CP VC Sajjanar | సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? ఇల్లు జాగ్రత్త.. సీపీ వీసీ సజ్జనార్ సూచనలు..
CP VC Sajjanar | సంక్రాతి పండుగ నేపథ్యంలో నగరం నుంచి సొంత ఊర్లకు వెళ్తున్నవారు తమ ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ప్రజలు పండుగ కారణంగా తమ ఇళ్లకు లాక్ వేసి చాలా రోజుల పాటు సెలవులను ఎంజాయ్ చేసేందుకు సొంత ఊర్లకు వెళ్తుంటారని అన్నారు.
CP VC Sajjanar | సంక్రాతి పండుగ నేపథ్యంలో నగరం నుంచి సొంత ఊర్లకు వెళ్తున్నవారు తమ ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ప్రజలు పండుగ కారణంగా తమ ఇళ్లకు లాక్ వేసి చాలా రోజుల పాటు సెలవులను ఎంజాయ్ చేసేందుకు సొంత ఊర్లకు వెళ్తుంటారని అన్నారు. అయితే అలా వెళ్లే ప్రజలు తమకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో లేదా బీట్ ఆఫీసర్‌కు ఆ వివరాలను తెలియజేయాలని, దీని వల్ల తాళం వేసి ఉన్న ఇళ్ళు కలిగిన ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచుతారని అన్నారు. దీంతో నేరాలు, దొంగతనాలు జరగకుండా చూడవచ్చని తెలిపారు.
ప్రజలు తమ ఇళ్లలో విలువైన వస్తువులను ఉంచకూడదని సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ముఖ్యంగా నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచి కొందరు తాళం వేసి వెళ్తారని, కానీ అలా చేయకూడదని అన్నారు. అలాంటి వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్ర పరుచుకోవాలని, లేదా సురక్షితంగా ఉండే ప్రదేశంలో పెట్టాలని సూచించారు. చాలా రోజుల పాటు ప్రజలు సెలవులను గడిపేందుకు వెళ్తారు కనుక కచ్చితంగా ఆయా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దొంగతనాలు జరిగిన తరువాత బాధ పడడం కన్నా వాటిని జరగకుండా నివారించడమే మేలని, దీంతో సెలవులను మనశ్శాంతిగా ఆస్వాదించవచ్చని అన్నారు.
ప్రజలకు, వారి ఇళ్లకు భద్రతను కల్పించడంలో, శాంతి భద్రతలను నెలకొల్పడంలో పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం కూడా అవసరమని స్పష్టం చేశారు. పండుగల నేపథ్యంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రజలు ఏదైనా అత్యవసర సహాయం కావల్సి వస్తే 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించాలని సజ్జనార్ సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hyderabad City Police | చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నకిలీ నంబర్ ప్లేట్.. క్రిమినల్ కేసు నమోదు
మే 20, 2026

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



