త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | నువ్వు మంత్రి అయ్యాకే తెలంగాణ వాళ్లు నీళ్లు తాగుతున్నారా: హ‌రీశ్‌పై నిప్పులు చెరిగిన జ‌గ్గారెడ్డి

Jagga Reddy | హ‌రీశ్‌రావు (Harish Rao) మంత్రి అయ్యాకే తెలంగాణ (Telangana) వాళ్లు నీళ్లు తాగుతున్నారా అని టీపీసీసీ (TPCC) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి (Jagga Reddy) ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్ (Telangana Bhavan)లో చెప్పిన విష‌యాలు అసెంబ్లీ (Assembly)లో ఎందుకు చెప్ప‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

A

Telangana | Published On Jan 4, 2026, 6.48 pm IST

Jagga Reddy | నువ్వు మంత్రి అయ్యాకే తెలంగాణ వాళ్లు నీళ్లు తాగుతున్నారా: హ‌రీశ్‌పై నిప్పులు చెరిగిన జ‌గ్గారెడ్డి
Advertisement

Jagga Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: హ‌రీశ్‌రావు (Harish Rao) మంత్రి అయ్యాకే తెలంగాణ (Telangana) వాళ్లు నీళ్లు తాగుతున్నారా అని టీపీసీసీ (TPCC) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి (Jagga Reddy) ప్ర‌శ్నించారు. తెలంగాణ భ‌వ‌న్ (Telangana Bhavan)లో చెప్పిన విష‌యాలు అసెంబ్లీ (Assembly)లో ఎందుకు చెప్ప‌లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan)లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ నీటి ప్రాజెక్టుల‌పై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ఇచ్చిన ప్ర‌జెంటేష‌న్‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. కాళేశ్వ‌రం వ‌ల్ల‌నే తెలంగాణ ప్ర‌జ‌లు నీళ్లు తాగుతున్న‌ట్లు హ‌రీశ్ చెబుతున్న‌ట్లు ఉంద‌ని ఎద్దేవా చేశారు. స్వ‌తంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేయ‌లేదా అని ధ్వ‌జ‌మెత్తారు. మంజీరా, సింగూరు ప్రాజెక్టులు ఎవ‌రు క‌ట్టారని అడిగారు. ఈ రెండు ప్రాజెక్టులు హైద‌రాబాద్ జంట న‌గ‌రాల కోసం నిర్మించిన‌వ‌ని గుర్తు చేశారు. మంజీరా నీళ్లు న‌గ‌రానికి వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్ హైద‌రాబాద్‌లోనే నివ‌సిస్తున్నాడ‌న్న ఆయ‌న‌.. అప్పుడు హ‌రీశ్ చాలా చిన్నోడ‌ని చెప్పారు. హ‌రీశ్ చెప్పిన కూడిక‌లు, తీసివేత‌లు ఎవ‌రికి అర్థ‌మ‌వుతాయ‌ని ప్ర‌శ్నించారు. మంజీరా, సింగూరు నీళ్లు తాగే కేసీఆర్‌, హ‌రీశ్ పెద్ద వాళ్లు అయ్యార‌ని పేర్కొన్నారు. అలాంటిది ఇపుడు ఆ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్‌నే తిడుతున్నార‌ని విమ‌ర్శించారు.

నీళ్ల దోపిడీ అన్నందుకే కేసీఆర్ ప‌దేళ్లు సీఎం

ఇప్పుడు తిరిగి ఆంధ్రోళ్ల‌ని.. మొద‌లుపెట్టార‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. నీళ్ల దోపిడీ అన్నందుకు కేసీఆర్ ప‌దేళ్లు సీఎం అయ్యాడ‌ని ఆరోపించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమ ప్రాజెక్టుల పనులు 90 శాతం పూర్తి చేసింది కాంగ్రెస్సేన‌ని గుర్తు చేశారు. మిగిలిన ప‌ది శాతం పూర్తి చేయాల‌ని అడిగితే కేసీఆర్ పట్టించుకోలేద‌ని మండిపడ్డారు. గ‌తంలో అసెంబ్లీలో పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్ర‌శ్నించిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డిని హ‌రీశ్‌రావు స‌స్పెండ్ చేయించార‌ని దుయ్య‌బ‌ట్టారు. అది గుర్తుకులేదా అని ప్ర‌శ్నించారు. ఆంధ్రోళ్లను తిట్టింది వాళ్లేన‌ని, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అన్నది వాళ్లేన‌ని విమ‌ర్శించారు.

సీఎంలు మాట్లాడుకుంటే త‌ప్పా?

ఇద్ద‌రు సీఎంలు మాట్లాడుకుంటే త‌ప్పేముంద‌ని అన్నారు. రేవంత్ టీడీపీ నుంచి వ‌స్తే.. కేసీఆర్ టీడీపీ నుంచి రాలేదా అని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక తెలంగాణ‌ రాష్ట్ర ఉద్య‌మం జ‌రుగుతున్న‌ప్పుడు టీడీపీతో బీఆర్ఎస్ ఎందుకు పొత్తుపెట్టుకుందో స‌మాధానం చెప్పాల‌న్నారు. అప్పుడు హ‌రీశ్‌రావు తెలివి ఏమైంద‌న్నారు. ఆంధ్రా, తెలంగాణ మ‌ధ్య కుంప‌టి పెట్టే ప‌నిలో హ‌రీశ్‌రావు ఉన్నాడ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ తోలు తీస్తా అంటేనే రేవంత్ తిట్టాడు

కేసీఆర్ తోలు తీస్తా అనక‌పోతే రేవంత్‌రెడ్డి తిట్టేవాడే కాద‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు. ఆయ‌న తోలు తీస్తా అంటే ఈయ‌న నాలుక కోస్తా అన్నాడ‌ని, అలా అన‌క‌పోతే ఎలా అని వ్యాఖ్యానించారు. చిన్న‌పిల్ల‌ల చేష్ట‌ల‌లా కేటీఆర్ ప‌నులు ఉన్నాయ‌ని, అందుకే తొండ‌లు ఇడుస్తా అని రేవంత్ అన్నాడ‌ని వివ‌రించారు. రేవంత్‌, ఉత్త‌మ్‌, కోమ‌టిరెడ్డిలు కేసీఆర్‌ను స‌ల‌హాలు ఇవ్వాల‌ని అడుగుతున్నార‌ని గుర్తు చేశారు. సల‌హాలు ఇవ్వొచ్చ‌ని, కానీ తిడితే తిరిగి తిట్ట‌రా అని ప్ర‌శ్నించారు. రేవంత్ కాబ‌ట్టి నాలుక కోస్తా అన్నాడ‌ని, కానీ తానుంటే ఇంకా ఏదో అనే వాడిన‌ని చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement