Harish Rao | ఎగవేతల, స్కామ్‌ల రేవంత్ రెడ్డి.. నీకు ఫుట్‌బాల్ సోకులు కావాల్నా? : హరీశ్ రావు ధ్వజం
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురుకులాల టెండర్లలో రూ.2000 కోట్ల కుంభకోణం జరిగిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను, నిరుద్యోగులను ఘోరంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
Karimnagar | Published On Jun 16, 2026, 3.51 pm IST
సంక్షిప్త సారాంశం
గురుకులాల్లో బట్టలు, కోడిగుడ్ల టెండర్లలో రూ.2,000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డ రూ.19,000 కోట్ల రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 25 నుంచి ప్రారంభం కాబోయే ఓటర్ల సర్వేలో (SIR) బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.
- రూ.2000 కోట్ల గురుకుల కుంభకోణంపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం అల్గనూర్ గ్రామంలో జరిగిన బీఆర్ఎస్ (BRS) విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూ, రాష్ట్రంలో పాలన పడకేసిందని, స్కీముల స్థానంలో స్కాములు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

గురుకులాల్లో రూ.2,000 కోట్ల టెండర్ల స్కామ్
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే అన్నం, ఉప్పు, పప్పులతో పాటు బట్టలు, బూట్ల టెండర్లలో ఏకంగా రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బట్టలు, బూట్లకు రూ.1200 కోట్లు, నిత్యావసరాలకు రూ.800 కోట్లతో టెండర్లు పిలిస్తే, సొంత శాఖలపై మంత్రులకు కనీస అవగాహన లేకపోవడం విచారకరమన్నారు. ఈ టెండర్లన్నీ 'అనుముల' అన్నదమ్ములే మింగుతున్నారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, కేవలం తన నలుగురు అన్నదమ్ములను మాత్రమే కోటీశ్వరులను చేశారని ఆరోపించారు.

రైతుబంధుపై తీవ్ర ఆగ్రహం
దేవుని సాక్షిగా రుణమాఫీ, పెన్షన్లు, నిరుద్యోగ భృతి వంటి హామీలన్నింటినీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రిని ఇకపై 'ఎగవేతల రేవంత్ రెడ్డి' అని పిలవాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు విడతల్లో రైతుబంధు ఎగ్గొట్టి, అన్నదాతలకు రూ.19,000 కోట్లు బాకీ పడిందని మండిపడ్డారు. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, 'రైతు డిస్కమ్' పేరుతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఉరితాడు బిగించే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బంద్.. నిరుద్యోగులపై డబుల్ బాదుడు
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో 30 లక్షల మంది పేద విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఆగిపోయాయని, వారి జీవితాలు ఆగం అవుతున్నాయని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి మోసం చేశారన్నారు. పైగా అప్లికేషన్ ఫీజును రూ.400 నుంచి రూ.800కు పెంచి నిరుద్యోగుల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై భారం వేస్తూ రిజిస్ట్రేషన్లు, ఆర్టీఏ ఛార్జీలు, బస్సు టికెట్ల ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారని విమర్శించారు.

పేదలకు పైసల్లేవు కానీ.. క్యాంప్ ఆఫీసులకు వందల కోట్లా?
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫ్యూచర్ సిటీ, MCRHRDలలో వందల కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటూ, సచివాలయంలో వాస్తు మార్పులకు కోట్లు ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. మెస్సీ ఫుట్‌బాల్ సోకులకు, మూసీ సుందరీకరణకు, ఢిల్లీకి మూటలు పంపడానికి రేవంత్ రెడ్డికి వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ శ్రేణులపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

జూన్ 25 నుంచి ఓటర్ల సర్వే (SIR).. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరిగే కీలకమైన ఓటర్ల సవరణ ప్రక్రియ (SIR) ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు జరగనుందని హరీశ్ రావు తెలిపారు. అధికారులు ఇంటింటికి వచ్చి డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తారని, 2002 నాటి ఓటు హక్కు ఆధారంగా ఫ్యామిలీ గ్రూపింగ్ జరుగుతుందని వివరించారు. ఒకవేళ అప్పుడు ఓటు లేకపోయినా SSC సర్టిఫికెట్, ఆధార్, కరెంట్ బిల్లు వంటి 10 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపిస్తే ఓటు నమోదు చేస్తారన్నారు. మన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లపై (BLA) ఉందని, ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Investment | పిల్లల భవిష్యత్తుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది? ఏయే మార్గాలు ఉన్నాయి..?
- ●Gurrala Nagaraju | దక్షిణాఫ్రికాలో తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం
- ●Religious Conversion | మత్తుమందు ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం.. ఆపై బలవంతంగా మతమార్పిడి
- ●Sunitha | చిన్నారులపై అఘాయిత్యం చేస్తే కాల్చి పడేయాలి
- ●Allu Arjun | బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా - అల్లు అర్జున్ సాంగ్‌తో ప్రధాని మోదీ పోస్ట్
- ●USA IPOs | భారతీయులకు గుడ్ న్యూస్.. ఇక అమెరికా ఐపీవోల్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు..

Investment | పిల్లల భవిష్యత్తుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది? ఏయే మార్గాలు ఉన్నాయి..?

Gurrala Nagaraju | దక్షిణాఫ్రికాలో తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం

Religious Conversion | మత్తుమందు ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం.. ఆపై బలవంతంగా మతమార్పిడి

Sunitha | చిన్నారులపై అఘాయిత్యం చేస్తే కాల్చి పడేయాలి






