Gurrala Nagaraju | దక్షిణాఫ్రికాలో తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం
Gurrala Nagaraju | దక్షిణాఫ్రికాలో ప్రముఖ బ్రాండ్ అయిన హాల్స్ సంస్థ సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కొంతమందిని వింటర్ హీరోస్‌గా ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా తెలంగాణ బిడ్డ గుర్రాల నాగరాజు చోటు దక్కించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.
International | Published On Jun 16, 2026, 3.33 pm IST
‘వింటర్ హీరో’గా గుర్రాల నాగరాజు ఎంపిక
Gurrala Nagaraju | త్రినేత్ర.న్యూస్ : దక్షిణాఫ్రికాలో ప్రముఖ బ్రాండ్ అయిన హాల్స్ సంస్థ సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కొంతమందిని వింటర్ హీరోస్‌గా ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా తెలంగాణ బిడ్డ గుర్రాల నాగరాజు చోటు దక్కించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.
గత 18 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి, సమాజ సేవలో నిబద్ధతతో పని చేస్తూ నాగరాజు అనేక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో వేలాది మందికి ఆహార సహాయం అందించడం, అత్యవసర పరిస్థితుల్లో తెలుగు ప్రజలకు సహాయం చేయడం, పేదలు, అనాథలు, మానసిక వికలాంగులకు చేయూతనివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
దక్షిణాఫ్రికాలో భారతీయ, తెలుగు సమాజ అభివృద్ధి కోసం కమ్యూనిటీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. మహిళల సాధికారత కోసం మహిళా కిట్ల పంపిణీ, పోలీస్ స్టేషన్లలో బ్లాంకెట్ డ్రైవ్‌లు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు సహాయ కార్యక్రమాలు, అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు వంటి అనేక కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం అందించారు.
ప్రస్తుతం JNS Cloud Solutions సంస్థ వ్యవస్థాపకుడిగా, అలాగే Uplift A Child South Africa Directorగా సేవలందిస్తూ సాంకేతిక రంగంలోనూ, సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. హాల్స్ సంస్థ అందించిన “Winter Hero” గుర్తింపు కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా విదేశాల్లో తెలంగాణ పేరు ప్రతిష్టలను చాటుతున్న ప్రతి తెలుగు వ్యక్తికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.
జగిత్యాల నేల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయిలో సేవా స్పూర్తికి ప్రతీకగా నిలవడం తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం. విద్య, కృషి, సేవాభావం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు సాధించవచ్చని గుర్రాల నాగరాజు మరోసారి నిరూపించారు.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





