Kavitha | కవిత రాజీనామా ఆమోదం.. మండలి చైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
Kavitha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, నిన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించిన సంగతి తెలిసిందే.
Kavitha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా, నిన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక బుధవారం ఆమె రాజీనామా ఆమోదంపై గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకున్నప్పుడు బాధ్యతగా ఆలోచించుకోమని చెప్పామని గుత్తా పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆ లేఖను పీఏతో తనకు పంపి ఫోన్ చేసిందని తెలిపారు. ఇక నేరుగా ఆమెనే వ్యక్తిగతంగా వచ్చి రాజీనామాను ఆమోదించమని చెప్పింది.. అంతేకాకుండా రాజీనామాకు గల కారణాలను కూడా వివరంగా తనకు తెలిపారు. కాబట్టే కవిత రాజీనామాను ఆమోదించినట్లు మండలి చైర్మన్ పేర్కొన్నారు. సభలో బీఆర్ఎస్ పక్షాన కవిత ఒక్కరే ఉన్నందున ఆమెకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇక శాసనమండలి కొత్త భవనం వచ్చే నెల చివరి నాటికి పూర్తవుతుందన్నారు. ఎవరైనా భాష విషయంలో కంట్రోల్‌గా ఉంటే మంచిది. భావితరాల కోసం మంచి భాషను మాట్లాడాలి అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. అయితే పదవులకు రాజీనామా చేసిన అనంతరం కారణాలను వివరించేందుకు ఎవరికీ చట్టసభల్లో అవకాశం ఇచ్చిన ఉదంతం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు లేదు. గతంలో ఎన్టీఆర్ రాజీనామా చేసినప్పుడు సైతం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా, స్పీకర్ నిర్ద్వందంగా తిరస్కరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



