Miryalaguda | బోరు గుంతలో మనువడు.. రక్షించబోయి మరణించిన తాత..
Miryalaguda | నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) మండలం ఊట్లపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. బోరుగుంటలో పడిన మనవడిని కాపాడబోయిన తాత (grandfather) మృతిచెందాడు. మనవడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు.
Miryalaguda | త్రినేత్ర.న్యూస్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) మండలం ఊట్లపల్లిలో విషాదం చోటుచేసుకున్నది. బోరుగుంటలో పడిన మనవడిని కాపాడబోయిన తాత (grandfather) మృతిచెందాడు. మనవడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు.
ఊట్లపల్లి శివారులోని వ్యవసాయ పొలంలోని బోరు గుంతలో నాలుగేండ్ల బాలుడు ప్రమాద వశాత్తు పడిపోయాడు. గమనించిన బాలుడి తాత వెంకన్న (53) అతడిని రక్షించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదే బోరు గుంతలో ఇరుక్కుపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరు బావిలో నుంచి తాత, మనవడిని బయటకు తీశారు. అయితే ఊపిరి ఆడకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?
- ●Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్
- ●Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
- ●Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

Global Passport Index 2026 | గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో 125వ స్థానానికి పడిపోయిన భారత్.. ఏయే దేశాలకు వీసా-ఫ్రీగా వెళ్లొచ్చంటే?

Mother Helps Son Crack JEE | బెడ్‌పై కొడుకు.. క్లాస్‌లో తల్లి: జేఈఈ అడ్వాన్స్డ్ క్రాక్ చేసి ఐఐటీ ఢిల్లీకి ఎంపికైన గుంజన్

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

Vakiti Srihari | పాడి రైతుల కష్టాలు నాకెరికే.. ఇక 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తం






