Congress Party | కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ చిచ్చు
Congress Party | కొత్తగా ప్రకటించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ( Graduate MLC ) అభ్యర్థుల జాబితా అధికార కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో కొత్త చిచ్చు రేపింది. రెండింటికి రెండు రెడ్డి సీట్లను సామాజిక వర్గానికే కేటాయించడం పట్ల బీసీ నేతలు( BC Leaders ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఖమ్మం - వరంగల్ - నల్లగొండ స్థానం అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి( Sarvotham Ramreddy ) ఎంపిక పట్ల నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) విముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
సామ రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిలకు
నామినేషన్‌లపై బీసీ నేతల అసంతృప్తి
నేరుగా వెళ్లి పీసీసీ చీఫ్‌ను నిలదీసిన నేతలు
శాంతింపజేసేందుకు ఓబీసీ సింహగర్జన సభ
వచ్చేసారి బీసీయే సీఎం అవుతారంటూ
మహేశ్ గౌడ్ బహిరంగ ప్రకటన
సర్వోత్తమ్‌పై మంత్రి ఉత్తమ్ విముఖత?
పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఒత్తిడి
సీఎం వద్దకు చేరిన పంచాయితీ
తక్షణం.. ప్రచార సభ నిర్వహించాలంటూ
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలకు ఆదేశం
ఖమ్మంలో అట్టహాసంగా జరిగిన సన్నాహక సభ
సర్వోత్తమ్‌కే ఓటు వేయాలంటూ.. మంత్రుల ప్రచారం
Congress Party | త్రినేత్ర న్యూస్ : కొత్తగా ప్రకటించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ( Graduate MLC ) అభ్యర్థుల జాబితా అధికార కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో కొత్త చిచ్చు రేపింది. రెండింటికి రెండు రెడ్డి సీట్లను సామాజిక వర్గానికే కేటాయించడం పట్ల బీసీ నేతలు( BC Leaders ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఖమ్మం - వరంగల్ - నల్లగొండ స్థానం అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి( Sarvotham Ramreddy ) ఎంపిక పట్ల నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) విముఖంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో.. పార్టీలో, ప్రభుత్వంలో సర్దుకుపోయాయనుకుంటున్న విభేదాలు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో మరోమారు బహిర్గతమయ్యాయి.
బీసీ నేతల అసంతృప్తి
మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, ఖమ్మం - వరంగల్ - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల స్థానాలకు కాంగ్రెస్ పార్టీ సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే. గత నెల చివరి వారంలో అధిష్టానం వద్దకు వెళ్లి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM revanth Reddy ), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వీరిద్దరి పేర్లను ఖరారు చేసుకొని వచ్చారు. కాగా.. రెండింటికి రెండు రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించడంతో బీసీ నేతలంతా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్( Mahesh Goud )ను నిలదీశారు. దీంతో ఆయన వారిని సముదాయించారు. రాబోయే శాసనమండలి ఎన్నికలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా.. ఈ వ్యవహారంలో అంసతృప్తిగా ఉన్న బీసీలను సముదాయించేందుకు అక్టోబర్ 4న కాంగ్రెస్ పార్టీ తరపున ఓబీసీ సింహగర్జన సదస్సు నిర్వహించారు. " ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడని ఘంటాపథంగా చెబుతున్నాను.. బీసీల హక్కుల కోసం ఈ ధైర్యం రాహుల్ గాంధీ ఇచ్చింది.. మల్లికార్జున ఖర్గే ఇచ్చిన ధైర్యం.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పార్టీ.. ఒక కులానికో.. ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో పరిమితమైన పార్టీ కాదు.. కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను అక్కున చేర్చుకుంటుంది కాబట్టి అగ్రవర్ణాలు కూడా మద్దతు ఇస్తారనడానికి ఇక్కడ ఉన్న నాయకులే నిదర్శనం... అన్ని కులాల మద్దతుతోనే మాకు రావాల్సిన వాటా తీసుకుంటాం.. అవసరమైతే లాక్కుంటాం" అని మహేశ్ గౌడ్ శంషాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు.
సర్వోత్తమ్‌పై మంత్రి ఉత్తమ్.. విముఖత
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సర్వోత్తమ్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకానొక దశలో.. పోటీ నుంచి తప్పుకోవాలంటూ సర్వోత్తమ్‌కు మంత్రి ఉత్తమ్ సలహా ఇచ్చినట్టు సమాచారం. దీనికి సర్వోత్తమ్ ససేమిరా అనడంతో ఈ పంచాయితీ సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. ఇక ఆలస్యం చేయకుండా.. అక్టోబర్ 10 శనివారం రోజు ఖమ్మంలో సన్నాహక సమావేశం పేరుతో .. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులతో.. సర్వోత్తమ్‌కే ఓటు వేయాలంటూ ప్రచార సభ నిర్వహించారు. అయితే.. మంత్రి ఉత్తమ్ అనుచర వర్గం అభిప్రాయం మరోలా ఉంది. సర్వోత్తమ్ పట్ల మంత్రి ఉత్తమ్‌కు ఎలాంటి విముఖత లేదని చెబుతున్నారు. సర్వోత్తమ్ బలహీన అభ్యర్థిగా భావించి.. ఆయన గెలుపోటముల గురించి ఆలోచించే ఆ రకమైన సలహా ఇచ్చి ఉండొచ్చని వెనకేసుకొచ్చారు. అంతర్గతంగా కారణాలు ఏవైనా.. మొత్తానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mallikarjun Kharge | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. సీజేఐని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా
అక్టోబర్ 11, 2026

Errabelli Dayakar Rao | ఆస్తులను లాక్కునే పనిలో సీఎం రేవంత్ ప్రభుత్వం
అక్టోబర్ 11, 2026

Jaggareddy | ఛత్రపతి శివాజీని రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ వాడుకుంటుంది : జగ్గారెడ్డి
అక్టోబర్ 11, 2026
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | రైతన్నలూ! మా మాట వినండి.. యాసంగి పంట వద్దు
- ●Sreeleela | కుందేళ్లతో శ్రీలీల ఆటలు - వీకెండ్ వైబ్స్ అదుర్స్
- ●Delhi Police | నిరసనకు అనుమతి లేదు.. చట్టాన్ని ఉల్లంఘించారు
- ●Tirumala Brahmotsavam | తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ఆ వైభవం వెనుక అసలు కథ!
- ●Ramayana | అఫీషియల్ - రామాయణ రిలీజ్ డేట్ ఫిక్స్ - మైథాలజీ మూవీపై కనిపించని బజ్
- ●Komatireddy Rajagopal Reddy | ఏదుల నుంచి మునుగోడుకు నీళ్లు తరలించాల్సిందే.. రాజీపడే ప్రసక్తే లేదు

Ponguleti Srinivas Reddy | రైతన్నలూ! మా మాట వినండి.. యాసంగి పంట వద్దు

Sreeleela | కుందేళ్లతో శ్రీలీల ఆటలు - వీకెండ్ వైబ్స్ అదుర్స్

Delhi Police | నిరసనకు అనుమతి లేదు.. చట్టాన్ని ఉల్లంఘించారు

Tirumala Brahmotsavam | తిరుమలలో బ్రహ్మోత్సవాలు.. ఆ వైభవం వెనుక అసలు కథ!



