త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుండు

Adi Srinivas | ఫార్ములా ఈ కార్ రేసు( Formula E Car Race ) కేసు.. లొట్ట‌పీసు కేసు అని.. ఏం పీక్కుంటారో పీక్కోండి అని గ‌ప్పాల్ కొట్టిన కేటీఆర్( KTR ) ఇప్పుడు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాడు అని ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్( Adi Srinivas ) ధ్వ‌జ‌మెత్తారు. ఈ కేసుపై రంకెలు వేసిన కేటీఆర్ ఇప్పుడు కోర్టుల చుట్టూ ప‌రుగులు పెడుతున్నాడ‌ని నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Oct 13, 2026, 12.44 pm IST

Adi Srinivas | లొట్ట పీసు కేసు అని.. ఇప్పుడేమో గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుండు
Advertisement

కేటీఆర్ డిశ్చార్జ్ పిటిష‌న్‌పై ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

Adi Srinivas | త్రినేత్ర న్యూస్ : ఫార్ములా ఈ కార్ రేసు( Formula E Car Race ) కేసు.. లొట్ట‌పీసు కేసు అని.. ఏం పీక్కుంటారో పీక్కోండి అని గ‌ప్పాల్ కొట్టిన కేటీఆర్( KTR ) ఇప్పుడు గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నాడు అని ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్( Adi Srinivas ) ధ్వ‌జ‌మెత్తారు. ఈ కేసుపై రంకెలు వేసిన కేటీఆర్ ఇప్పుడు కోర్టుల చుట్టూ ప‌రుగులు పెడుతున్నాడ‌ని నిప్పులు చెరిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి ఛార్జీషీటులో త‌న పేరును తొల‌గించాలంటూ నాంప‌ల్లి ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు.

డిశ్చార్జ్ పిటిష‌న్ దాఖ‌లు చేసి ఈ కేసు నుంచి త‌ప్పించుకోవాల‌ని కేటీఆర్ చూస్తున్నాడు. ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోతే కేటీఆర్ ఎందుకు భ‌య‌ప‌డుతున్నాడు..? ఇది లొట్ట‌పీసు కేసు అని ఇంత‌కాలం ఎందుకు గ‌ప్పాలు కొట్టాడు..? విచారణను ఎదుర్కోవడానికి కేటీఆర్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. విచారణకు పిలిచినప్పుడు ఏసీబీ ఆఫీసు ముందు కేటీఆర్ పెద్ద షో చేశాడు. కేసులో ఏమీ లేదు, ఏం పీక్కుంటారో పీక్కోండి అని పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్లాడు..? ఎందుకు భయపడుతున్నాడు..? అని ఆది శ్రీనివాస్ నిల‌దీశారు.

ఫార్ములా ఈ ఆప‌రేష‌న్ సంస్థకు చెల్లించిన రూ. 54.88 కోట్ల చెల్లింపుపై కేటీఆర్ స‌మాధానం చెప్పాలి. ఎవరి అనుమతితో ఈ డబ్బులు పంపావో చెప్పాలన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు. నువ్వు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో నీ నిజాయితీ నిరూపించుకో. డిశ్చార్జ్ పిటిషన్లు వేసి మధ్యలోనే తప్పించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు..? లొట్టపీసు కేసు అన్న కేటీఆర్ ఇప్పుడు దాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు అని మండిప‌డ్డారు.

స్టార్ హోటళ్ల భాగోతం బయటకు రావడంతో చలి, జ్వరం వచ్చి తప్పించుకుని కేటీఆర్ తిరుగుతున్నాడు. గజగజ వణికిపోతున్నాడు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఎక్కడ దొరికిపోతానోనని దొంగదార్లు వెతుక్కుంటున్నాడు. కేటీఆర్ వైఖరిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. కేటీఆర్ అక్రమాలు బయటకు వస్తాయన్న విశ్వాసం ఉంది. కోర్టుల ద్వారా కేటీఆర్ బండారం బయటపడుతుంది అని ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.

Advertisement
Advertisement