Ration | ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కోటా ఒకేసారి.. నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ
Ration | మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం (Ration) ఒకేసారి ఇవ్వనున్నారు. గత వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేశారు.
Ration | త్రినేత్ర.న్యూస్: మరోసారి మూడు నెలల రేషన్ బియ్యం (Ration) ఒకేసారి ఇవ్వనున్నారు. గత వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేశారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో (El Nino) ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో శనివారం (ఆగస్టు 1) నుంచే బియ్యం పంపిణీ ప్రారంభమయింది. వచ్చే నెలల బియ్యాన్ని కూడా ముందుగానే ఇస్తుండటంతో ఆగస్టు నెల మొత్తం రేషన్ దుకాణాలు తెరచే ఉండనున్నాయి. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 రోజుల పాటు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ చేసే విషయం తెలిసిందే.
రాష్ట్రంలో సుమారు 1.06 కోట్ల రేషన్ కార్డులపై 3.41 కోట్ల మంది లబ్దిదారులు ఈ పంపిణీ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. మూడు నెలల కోటాను ఒకేసారి అందించేందుకు దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో ప్రతి రేషన్ కార్డుదారు ఈ–పోస్ యంత్రాల ద్వారా మూడుసార్లు బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!






