త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM KISAN | ప్ర‌ధాన్ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి మ‌రో ఐదేండ్లు పొడిగింపు.. 

PM KISAN | అన్న‌దాత‌ల‌కు ఆర్థిక మ‌ద్ద‌తునిచ్చేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి (PM KISAN) ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో ఐదేండ్లు పొడిగించింది. ఏటా మూడు విడుత‌ల్లో రూ.2000 చొప్పున పంట పెట్టుబ‌డి సహాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో (DBT) జ‌మచేస్తున్న‌ది.

G

National | Published On Aug 1, 2026, 6.49 am IST

PM KISAN | ప్ర‌ధాన్ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి మ‌రో ఐదేండ్లు పొడిగింపు.. 
Advertisement

PM KISAN | త్రినేత్ర‌.న్యూస్‌: అన్న‌దాత‌ల‌కు ఆర్థిక మ‌ద్ద‌తునిచ్చేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి (PM KISAN) ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో ఐదేండ్లు పొడిగించింది. ఏటా మూడు విడుత‌ల్లో రూ.2000 చొప్పున పంట పెట్టుబ‌డి సహాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో (DBT) జ‌మచేస్తున్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు 23 వాయిదాల్లో రైతుల‌కు పీఎం కిసాన్‌ను చెల్లించింది. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2030-21 ఆర్థిక ఏడాది వ‌ర‌కు ఈ ప‌థ‌కం అమ‌ల్లో ఉండ‌నుంది. ఈ ఐదేండ్ల‌కు గాను రూ.3.15 ల‌క్ష‌ల కోట్లు కేటాయించింది.

ప్ర‌తిఏటా ప్ర‌భుత్వం అందించే సాయాన్ని 92 శాతం మంది ల‌బ్ధిదారులు నేరుగా వ్యవసాయ పనులకు వినియోగించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 85 శాతం రైతులు తమ వ్యవసాయ ఆదాయం పెరిగిందని, ప్రైవేట్‌ అప్పులపై ఆధారపడటం తగ్గిందని చెప్పారు. పీఎం–కిసాన్‌ పథకం అమలుతో 2020–21 నుంచి 2025–26 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 9.65 శాతం, ఉత్పాదకత 10.53 శాతం మేర పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫలితంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 21.18 శాతం వృద్ధి నమోదైంది.

ఎంత‌మంది ల‌బ్ధి పొందుతున్నారంటే?

రైతుల‌కు పంట పెట్టుబ‌డి సాయం అందించి ఆర్థికంగా ఆదుకోవాల‌నే ఉద్దేశంతో పీఎం కిసాన్ ప‌థ‌కాన్ని 2019, ఫిబ్ర‌వ‌రి 24న బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌లో ప్ర‌ధాని మోదీ (PM Modi) ఈ ప‌థ‌కాన్ని అధికారికంగా ప్రారంభించారు. అయితే 2018, డిసెంబ‌ర్ 1 నుంచే అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు ప‌రిగ‌ణిస్తున్నారు. ప్రతి పంట కాలంలో విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ పరికరాల కొనుగోలుకు అర్హులైన రైతుల‌కు ఏడాదికి రూ.6 వేల ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌తిఏటా కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న‌ది. ఈ మొత్తాన్ని ప్ర‌తి నాలుగు నెల‌ల‌కు ఒక‌సారి రూ.2000 చొప్పున మూడు విడుత‌ల్లో రైతుల ఖాతాల్లో జ‌మ‌చేస్తున్న‌ది. ఈ పథకం లబ్ది పొందడానికి ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (eKYC) తప్పనిసరి. దేశ‌వ్యాప్తంగా 9.49 కోట్ల‌కుపైగా రైతు కుటుంబాలు ప్ర‌స్తుతం ల‌బ్ది పొందుతున్నాయి. ఇటీవ‌ల 23వ విడ‌తగా రూ.18,984 కోట్ల‌ నిధుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం రైతుల ఖాతాల్లో జ‌మ‌చేసింది.

ప్ర‌తి న‌లుగురిలో ఒకరు మ‌హిళా రైతు..

ల‌బ్ధిదారుల్లో దాదాపు ప్ర‌తి న‌లుగురిలో ఒక మ‌హిళా రైతు ఉన్నారు. ప‌థ‌కం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మ‌హిళా రైతుల‌కు రూ.1.06 ల‌క్ష‌ల కోట్ల‌కుపైగా ఆర్థిక స‌హాయం అందింది. 2019 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు (23వ విడ‌త‌) మొత్తం 4.47 ల‌క్ష‌ల కోట్ల‌కుపై నిధుల‌ను రైతుల‌కు స‌హాయంగా అందించింది.

 

ట్యాగ్స్:

Advertisement
Advertisement