Revanth Reddy | పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు పండించేలా ప్రోత్సహించండి.. ప్రత్యామ్నాయ పంటలకు సబ్సిడీ ఇవ్వండి
Revanth Reddy | రైతులు కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజల పంటలు, కూరగాయలు, పశుగ్రాస పంటలు వేసుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని ఎల్‌నినో అధ్యయన కమిటీ చైర్మన్ డా.జి.చిన్నారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు అంచనా వ్యయం రూ. 802.92 కోట్లు అవుతుందన్నారు.
- ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంపై సీఎం రేవంత్‌కు నివేదిక అందజేసిన నిపుణుల కమిటీ
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: రైతులు కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజల పంటలు, కూరగాయలు, పశుగ్రాస పంటలు వేసుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని ఎల్‌నినో అధ్యయన కమిటీ చైర్మన్ డా.జి.చిన్నారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు అంచనా వ్యయం రూ. 802.92 కోట్లు అవుతుందన్నారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిఫారసులతో కూడిన నివేదికను కమిటీ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి గురువారం అందజేశారు. రైతులకు సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ముఖ్య సిఫారసులు ఇవే..
- నీటి పొదుపు – డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులకు ప్రాధాన్యం
- మాల వారీగా ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం
- ప్రత్యామ్నాయ పంటల విత్తనాలపై 75% వరకు సబ్సిడీ
- ఉద్యాన పంటలు, కూరగాయలు, ఆయిల్‌పామ్, పండ్ల తోటల విస్తరణ
- జిల్లా వారీగా పశుగ్రాస బ్యాంకులు, మేత పంటలు, సైలేజ్, అజోల్లా ప్రోత్సాహం
- రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను నిరంతరం అందించడం
- చెక్‌డ్యాంలు, ఫార్మ్ పాండ్లు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్
- మిషన్ భగీరథ ద్వారా తాగునీటి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
- సేంద్రియ ఎరువులు, జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం
వర్షపాతం పరిస్థితి..
- సాధారణ వర్షపాతం: 740.60 మి.మీ
- జూలై 27 నాటికి నమోదైన వర్షపాతం: 234.80 మి.మీ
- సాధారణంతో పోలిస్తే సుమారు 30% వర్షపాతం లోటు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, వ్యవసాయ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయ సంచాలకులు డా. బి.గోపి పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
జులై 30, 2026

Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
జులై 30, 2026

KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
జులై 30, 2026
తాజావార్తలు
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా
- ●Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట
- ●Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
- ●Vaddiraju Ravichandra | పరీక్ష అంటే ఏండ్ల కష్టం.. అందుకే ప్రజా పరీక్షల సవరణ బిల్లుకు మద్దతిస్తున్నం
- ●KTR | యువ ఇంజినీర్ల ప్రతిభను క్రిమినల్ వేస్ట్ అని అవమానిస్తారా..? : రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ

criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

Sanjay Jaju | పేరు సంజయ్ జాజు.. రాష్ట్రానికే సీఎస్.. అయినా అధికారిక నివాసం ఇస్తలేరట

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?



