త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

మెస్సీ హ్యాట్రిక్‌.. ఫిఫా వరల్డ్‌ కప్‌లో అర్జెంటీనా శుభారంభం

Argentina vs Algeria | డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ 2026లో శుభారంభం చేసింది. గ్రూప్-జేలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి గ్రూప్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇది మెస్సీకి రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ కావడం విశేషం.

P

Sports | Published On Jun 17, 2026, 9.27 am IST

మెస్సీ హ్యాట్రిక్‌.. ఫిఫా వరల్డ్‌ కప్‌లో అర్జెంటీనా శుభారంభం
Advertisement
  • అల్జీరియాపై 3-0 తేడాతో గెలుపు
  • మూడు గోల్స్‌తో ఆకట్టుకున్న మెస్సీ
  • క్లోజే రికార్డును సమం చేసిన కెప్టెన్‌
  • మెస్సీ నామస్మరణతో దద్దరిల్లిన కాన్సాస్‌ సిటీ

Argentina vs Algeria | డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ 2026లో శుభారంభం చేసింది. గ్రూప్-జేలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో అర్జెంటీనా మూడు పాయింట్లు సాధించి గ్రూప్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇది మెస్సీకి రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ కావడం విశేషం. అదే సమయంలో ఇది అతడి 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో ఈ పోరు మరింత ప్రత్యేకంగా నిలిచింది. 38 ఏళ్ల వయసులోనూ మైదానంలో చురుగ్గా కదులుతూ జట్టును ముందుండి నడిపించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. తొలి 10 నిమిషాల్లో అర్జెంటీనా, అల్జీరియా చెరోసారి గోల్ చేసినప్పటికీ ఆఫ్‌సైడ్ కారణంగా అవి రద్దయ్యాయి. ఆ తర్వాత అర్జెంటీనా క్రమంగా ఆటపై పట్టుసాధించింది.

17వ నిమిషంలో తొలి గోల్‌..

17వ నిమిషంలో మెస్సీ తన తొలి గోల్‌తో అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తన వద్దకు వచ్చిన బంతిని అల్జీరియా గోల్‌కీపర్ లూకా జిదాన్‌ను దాటించి గోల్‌గా మలిచాడు. దీంతో స్కోరు 1-0గా మారింది. ఆ తర్వాత కూడా అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగింది. అయితే, అల్జీరియా కూడా ఎదురుదాడికి ప్రయత్నించింది. 69వ నిమిషంలో హౌసమ్ చేసిన ప్రయత్నాన్ని అర్జెంటీనా గోల్‌కీపర్ అద్భుతంగా అడ్డుకోవడంతో ఆ జట్టుకు గోల్ అవకాశం చేజారింది. 60వ నిమిషంలో మెస్సీ మరోసారి మెరిశాడు. అలెక్సిస్ మాక్ అలిస్టర్ బాక్స్ బయట నుంచి చేసిన ప్రయత్నాన్ని గోల్‌కీపర్ పూర్తిగా నియంత్రించలేకపోయాడు. రీబౌండ్‌గా వచ్చిన బంతిని మెస్సీ చాకచక్యంగా గోల్‌గా మలిచాడు. దీంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు పెరిగింది.

ఆ తర్వాత 76వ నిమిషంలో మెస్సీ తన హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. జట్టు సమన్వయంతో వచ్చిన పాస్‌ను అద్భుతంగా గోల్‌గా మలిచి స్కోరును 3-0కు చేర్చాడు. ఈ గోల్‌తో అతడి ప్రపంచకప్ గోల్స్ సంఖ్య 16కు చేరింది. దీంతో జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజేతో కలిసి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మిగిలిన సమయంలో అర్జెంటీనా పూర్తి నియంత్రణతో ఆడింది. చివరి విజిల్‌తో మ్యాచ్ 3-0తో ముగిసింది. మెస్సీ హ్యాట్రిక్‌తో అల్జీరియా డిఫెన్స్ పూర్తిగా కూలిపోయింది. మరోవైపు అర్జెంటీనా జట్టు సమన్వయంతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో “మెస్సీ.. మెస్సీ” నినాదాలతో కాన్సాస్ సిటీ స్టేడియం మార్మోగింది.

Advertisement
Advertisement