త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్య‌ల‌ను కొండ సురేఖ ఖండించాలే : ప్ర‌భుత్వ విప్‌ బీర్ల ఐల‌య్య‌

Beerla Ilaiah | సుష్మిత చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి కొండ సురేఖ ఖండించాల‌ని ప్ర‌భుత్వ విప్ బీర్ల ఐల‌య్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేత‌ల‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

P

Telangana | Published On Aug 21, 2026, 3.34 pm IST

Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్య‌ల‌ను కొండ సురేఖ ఖండించాలే : ప్ర‌భుత్వ విప్‌ బీర్ల ఐల‌య్య‌
Advertisement

Beerla Ilaiah | సుష్మిత చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి కొండ సురేఖ ఖండించాల‌ని ప్ర‌భుత్వ విప్ బీర్ల ఐల‌య్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేత‌ల‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట‌ల్లోనే.. 'సీఎం రేవంత్‌ ప్ర‌జా పాల‌న‌తో గ‌త ప‌దేళ్ల‌లో జ‌ర‌గ‌ని అభివృద్ది చేస్తున్నారు. ధ‌నిక రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వం అప్పులు చేసినా, త‌ప్పులు చేసినా వాటిని స‌రిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. తెలంగాణ‌లోని వేలాది మంది కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డి పీసీసీ అధ్య‌క్షుడిగా ఎత్తిన జెండా దించ‌కుండా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తెచ్చి ప్ర‌జా పాల‌నను రేవంత్ తీసుకువ‌చ్చారు. ప్ర‌తిప‌క్షాల‌కు చెందిన కొంద‌రు, గిట్ట‌ని వారు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసినా గానీ.. స్వ‌ప‌క్షంలో ఉండి ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారంతో ప్ర‌జ‌ల‌కు సంక్షేమాన్ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు వెళ్లాలి' అని బీర్ల ఐల‌య్య పిలుపునిచ్చారు.

రెండోసారి ప్ర‌జాప్ర‌భుత్వం రావాలి

'మొన్న కొండ సురేఖ అక్క కూతురు కొండ సుష్మిత సీఎంపై మాట్లాడిన మాటల‌ను ఖండిస్తున్నాం. ఎంతోమంది ప్ర‌జ‌లు ప‌దేళ్ల బానిస పాల‌న వ‌ద్దు.. ప్ర‌జాపాల‌న ముద్ద‌ని తెచ్చుకున్న ప్ర‌జాపాల‌న‌లో మ‌రి అంద‌రం బాధ్యులుగా ముఖ్య‌మంత్రికి అండ‌గా నిలిచి సంక్షేమం, అభివృద్ధిని ప్ర‌తి గ‌డ‌ప‌కు చేరేలా ముందుకెళ్లాలి. నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్న ముఖ్య‌మంత్రిపై ఈర‌కంగా మాట్లాడ‌డం స‌రికాదు. దీనిపై కొండ సురేఖ స్పందించి.. సుష్మిత మాట్లాడిన మాట‌ల‌ను ఖండించాలి. పార్టీ అభివృద్ధి కోసం, మ‌రోసారి రేవంత‌న్న నాయ‌క‌త్వంలో రెండోసారి ప్ర‌జాపాల‌న రావాలి. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చి రాహుల్‌ను ప్ర‌ధానిగా చేసేంత వ‌ర‌కు క‌లిసిక‌ట్టుగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌రి అభివృద్ధి, సంక్షేమం చూసి ప్ర‌తిప‌క్షాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. ధ‌నిక రాష్ట్రంలో మేం చేయ‌ని ప‌నులు.. అప్పుల తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉండి మ‌న‌కు రావాల్సిన వాటాను తీసుకువ‌స్తున్నారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి.. తెలంగాణ అంటే భార‌త‌దేశంతో కాదు ప్ర‌పంచ దేశాల‌తో పోటీప‌డేలా కృషి చేస్తుంటే సొంత పార్టీలో ఉండి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం బాధాక‌రం. పార్టీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌లు గ్రామాల్లో చాలా ఇబ్బందులుప‌డుతున్నారు. పార్టీని న‌మ్ముకున్న వారికి న్యాయం చేయాలి' అన్నారు.

కూర్చొని మాట్లాడుకోవాలి..

'ఏదైనా ఉంటే సీఎల్పీ స‌మావేశం, పీసీసీ అధ్య‌క్షుడు ఆధ్వ‌ర్యంలో సీఎం అంద‌రూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన విష‌యాల‌ను బ‌హిరంగంగా సుష్మిత మాట్లాడ‌డం బాధ క‌లిగించింది. త‌ప్ప‌కుండా సురేఖ స్పందించి.. ఆమె మాట‌ల‌ను ఖండించి.. పార్టీకి, ప్ర‌భుత్వానికి ఎక్క‌డా ఇబ్బంది లేకుండా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప‌ని చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో 22ఏ కింద నిషేధ జాబితాలో ఉన్న భూముల విష‌యంపై అసెంబ్లీలోనే మాట్లాడాం. మంత్రి కోమ‌టిరెడ్డి, స‌ద‌రుశాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి సైతం ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామ‌న్నారు. కొంత అధికారుల త‌ప్పిదం వ‌ల్ల గ‌తం ప్ర‌భుత్వంలో 22ఏలో కింద ఉన్న భూముల‌ను హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, క‌లెక్ట‌ర్లు రిజిస్ట్రేష‌న్ ఆఫీసుల‌కు జాబితా పంప‌డం వ‌ల్లే ఆగాయి త‌ప్పా.. ఈ ప్ర‌భుత్వం 22ఏ పెట్టి ఏ పేదోడి ఇబ్బందులు పెట్టాల‌నేది ల‌క్ష్యం కాదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంటేనే పేద‌లు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు భూములు పంచిన చ‌రిత్ర కాంగ్రెస్‌ది. పేద‌ల‌కు ఇండ్లు క‌ట్టించిన ఘ‌న‌త కాంగ్రెస్‌ది. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటుప‌డుతుంటే ప్ర‌తిప‌క్షాలు చిల్ల‌ర‌మ‌ల్ల‌ర మాట్లాడుతున్న‌రు' అంటూ విమ‌ర్శించారు.

Advertisement
Advertisement