Nayanthara | నయనతార సినిమాలో విలన్‌గా కోలీవుడ్ హీరోయిన్ – రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్
నయనతార హీరోయిన్‌గా తమిళంలో మూక్కుత్తి అమ్మన్ 2 పేరుతో ఫాంటసీ కామెడీ మూవీ రాబోతుంది. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ రెజీనా విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Aug 21, 2026, 2.34 pm IST
Nayanthara | ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో నయనతార జోరు కొనసాగుతోంది. ఐదు భాషల్లో సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది మన శంకర వరప్రసాద్‌గారుతో పాటు మలయాళ మూవీ పేట్రియాట్‌తో ప్రేక్షకులను మెప్పించింది. నయనతార హీరోయిన్‌గా నటించిన కన్నడ మూవీ టాక్సిక్‌తో పాటు తమిళ సినిమా హాయ్ ఈ నెలలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. ఓ వైపు కొత్త సినిమాల ప్రమోషన్స్, షూటింగ్‌లతో నయన్ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంది.
అమ్మవారి పాత్రలో...
ప్రస్తుతం మూక్కుత్తి అమ్మన్ 2 పేరుతో ఓ ఫాంటసీ కామెడీ మూవీ చేస్తోంది నయనతార. ఈ తమిళ మూవీకి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. మూక్కుత్తి అమ్మన్ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌లో నయనతార హీరోయిన్‌గా నటించింది. అమ్మవారి పాత్రలో అసమాన నటనతో మెప్పించింది. కామెడీ టైమింగ్‌తో నవ్వించింది. సీక్వెల్‌లో నయనతార అమ్మవారి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సారి మరింత పవర్‌ఫుల్‌గా నయన్ పాత్ర సాగుతుందని అంటున్నారు.
రెజీనా విలన్...
మూక్కుత్తి అమ్మన్ 2 సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ రెజీనా విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. డార్క్ షేడ్స్‌తో చాలా ఇంటెన్స్‌గా ఆమె పాత్ర సాగనున్నట్లు చెబుతున్నారు. మెయిన్ విలన్‌గానే ఈ సినిమాలో రెజీనానే కనిపిస్తుందని అంటున్నారు.
ఓటీటీ డీల్ క్లోజ్...
షూటింగ్ పూర్తి కావడానికి ముందే మూక్కుత్తి అమ్మన్ 2 ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. దాదాపు యాభై కోట్లకు ఈ సినిమా దక్షిణాదితో పాటు హిందీ డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు.
మూక్కుత్తి అమ్మన్ మూవీలో ఖుష్బూ సుందర్, ఊర్వశి, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది చివరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముక్కుత్తి అమ్మన్ 2తో పాటు తమిళంలో మరో మూడు సినిమాలు చేస్తోంది నయనతార. సల్మాన్ ఖాన్ హీరోగా దిల్‌రాజు నిర్మిస్తున్న బాలీవుడ్ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..
- ●సీఎం రేవంత్ యూఎస్ పర్యటన బ్రేక్.. తెరపైకి 'ఐఓసీ' ఈవెంట్ వివాదం!
- ●Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే
- ●Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
- ●Taapsee | థియేటర్లలో కాదు...నేరుగా ఓటీటీలోకి తాప్సీ కొత్త మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- ●Vemula Veeresham | నీకు సంబంధం లేకుంటే.. నీ బిడ్డ మాటలను ఎందుకు ఖండించలే?

ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..

సీఎం రేవంత్ యూఎస్ పర్యటన బ్రేక్.. తెరపైకి 'ఐఓసీ' ఈవెంట్ వివాదం!

Vedma Bojju| పిల్ల కాకి కొండా సుష్మిత మాట్లాడిన మాటలు కావవి.. కొండా సురేఖ మాటలే

Starlink | గ్రామీణ భారతానికి స్టార్‌లింక్‌తో ఇంటర్నెట్.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు





