Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత – రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా!
టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. దిగ్గజ నటి షావుకారు జానకి అనారోగ్య సమస్యలతో శుక్రవారం చెన్నైలో కన్నుమూసింది. సుదీర్ఘ సినీ ప్రయాణంలో షావుకారు జానకి నాలుగు వందలకుపైగా సినిమాలు చేసింది. రెండు వందల సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
Entertainment | Published On Aug 21, 2026, 3.14 pm IST
Sowcar Janaki |అలనాటి దిగ్గజ నటి షావుకారు జానకి శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1950 -60 దశకంలో టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా షావుకారు జానకి పేరు తెచ్చుకున్నారు. 1950లో రూపొందిన షావుకారు పెద్ద హిట్టవ్వడంతో ఆ సినిమా పేరే జానకి ఇంటిపేరుగా మారింది.
రక్షా రేఖతో...
జానకి అసలు పేరు టేకుమళ్ల జానకి. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 1931 డిసెంబర్ 12న జన్మించారు జానకి. 1949లో వచ్చిన రక్షా రేఖ సినిమాతో జానకి సినీ ప్రయాణం మొదలైంది. ఎన్టీఆర్ హీరోగా ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన షావుకారు సినిమాలో జానకి హీరోయిన్‌గా నటించారు. సుబ్బులు పాత్రలో విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా పెద్ద హిట్టవ్వడంతో జానకి ఇంటిపేరు షావుకారుగా మారిపోయింది.
హీరోయిన్‌గా....
కన్యాదానం, వద్దంటే పెళ్లి, జయం మనదే, పాండురంగ మహత్యం, భాగ్యరేఖ, రేచుక్క పగటిచుక్క, డాక్టర్ చక్రవర్తితో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఓ వైపు కథానాయికగా కనిపిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీలక పాత్రలు చేసింది. గీతాంజలి, దేవి, శుభాకాంక్షలు, రంగూన్ రౌడీతో పాటు పలు సినిమాల్లో బామ్మ పాత్రలతో మెప్పించింది. చివరగా తెలుగులో అన్నీ మంచి శకునములే సినిమా చేసింది షావుకారు జానకి.
నాలుగు వందల సినిమాలు...
ఏడు పదుల సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, మలయాలం, హిందీ భాషల్లో కలిపి నాలుగు వందలకుపైగా సినిమాలు చేశారు షావుకారు జానకి. ఇందులో రెండు వందలకుపైగా సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ మొదలుకొని నేటితరం అగ్ర హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వరకు అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. సంసారం ఒక చదరంగం సినిమాకుగాను ఉత్తమ సహాయనటిగా నంది అవార్డును అందుకున్నారు జానకి.
తొంభై ఏళ్ల వయసులో పద్మశ్రీ....
షావుకారు జానకి చెల్లెలు కృష్ణకుమారి కూడా తెలుగులో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే నాటికే షావుకారు జానకికి పెళ్లయ్యింది. పదిహేనేళ్ల వయసులో ఉన్నప్పుడే శంకరమంచి శ్రీనివాసరావుతో పెళ్లి చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
సినీ రంగానికి చేసిన సేవలకు గాను జానకికి కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. తొంభై ఏళ్ల వయసులో పద్మశ్రీ ఆమెను వరించింది. పద్మశ్రీతో పాటు కర్ణాటక ప్రభుత్వం నుంచి రాజ్యోత్సవ అవార్డు, తమిళనాడు నుంచి కలైమామణితో పాటు ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు జానకి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jyothi Rai | హీరోయిన్‌గా గుప్పెడంత మనసు జగతి – సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ఆగస్టు 20, 2026

Rashmika Deverakonda | రష్మిక దేవరకొండ – భర్త ఇంటి పేరుతో నేషనల్ క్రష్ పోస్ట్ వైరల్ – విజయ్ క్యూట్ రిప్లై
ఆగస్టు 20, 2026

January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’.. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ మల్టీస్టారర్ మూవీ టైటిల్ ఫిక్స్..
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
- ●Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ
- ●Senior Citizen Savings Scheme | పోస్టాఫీస్ పథకం.. నెలకు రూ.20వేల ఆదాయం ఇలా..
- ●Nayanthara | నయనతార సినిమాలో విలన్‌గా కోలీవుడ్ హీరోయిన్ - రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్
- ●ASUS VM240 AiO | ఏఐ ఫీచర్లతో వచ్చిన అసుస్ కొత్త ఆలిన్ వన్ పీసీ.. ఏ పనికైనా సపోర్ట్..
- ●సీఎం రేవంత్ యూఎస్ పర్యటన బ్రేక్.. తెరపైకి 'ఐఓసీ' ఈవెంట్ వివాదం!

Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ

Senior Citizen Savings Scheme | పోస్టాఫీస్ పథకం.. నెలకు రూ.20వేల ఆదాయం ఇలా..

Nayanthara | నయనతార సినిమాలో విలన్‌గా కోలీవుడ్ హీరోయిన్ - రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్



