Minister Damodar Rajanarsimha | విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి దామోదర
Minister Damodar Rajanarsimha | రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువే సమాజంలో మార్పునకు నాంది పలుకుతుందని, అందుకే ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. చదువుతో ప్రజల్లో అవగాహన పెరిగి సామాజిక-ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Minister Damodar Rajanarsimha | రాష్ట్రంలో విద్య, వైద్యానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో సోమవారం ఆయన ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువే సమాజంలో మార్పునకు నాంది పలుకుతుందని, అందుకే ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. చదువుతో ప్రజల్లో అవగాహన పెరిగి సామాజిక-ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధ్యాయుల నియామకం, ఆధునిక సాంకేతికతతో విద్యా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామన్నారు. విద్యారంగంతో భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేయగలమని, అదే రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి పేదల ఆరోగ్యాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తోందని, అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో 109 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వృద్ధ తల్లిదండ్రుల కోసం 37 ప్రణామ్ కేంద్రాలు స్థాపించామన్నారు. రాష్ట్రంలో రూ.200 కోట్లతో 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తామని, చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు? వారి లక్ష్యం ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఐఏఎస్, డాక్టర్లు, ఇంజనీరింగ్, ఆర్మీ, నేవీల్లో పని చేయాలని ఉందని పలువురు తెలిపారు. విద్యార్థుల లక్ష్యాలను సాధించుకునే విధంగా ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై మంత్రి పలు సలహాలు, సూచనలు అందజేశారు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయం సాధ్యమన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ పట్టణంలోని 245 మంది మహిళా సంఘాల సభ్యులకు రూ.7.80కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు అందజేశారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



