త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Medaram | మేడారం భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌.. 28 నుంచి ప్ర‌త్యేక రైళ్లు

Medaram | మేడారం (Medaram) స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ (Sammakka Saralamma Jathara) జాత‌ర‌కు వెళ్లే ప్ర‌యాణీకుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. జాత‌ర ప్రారంభ‌మ‌య్యే 28వ తేదీ నుంచి ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుప‌నున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

A

Telangana | Published On Jan 23, 2026, 4.48 pm IST

Medaram | మేడారం భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌.. 28 నుంచి ప్ర‌త్యేక రైళ్లు
Advertisement

Medaram | త్రినేత్ర‌.న్యూస్‌ : మేడారం (Medaram) స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ (Sammakka Saralamma Jathara) జాత‌ర‌కు వెళ్లే ప్ర‌యాణీకుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway) అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. జాత‌ర ప్రారంభ‌మ‌య్యే 28వ తేదీ నుంచి ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుప‌నున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. 28 జ‌న‌సాధార‌ణ్ (అన్ రిజ‌ర్వ్‌డ్‌) ప్ర‌త్యేక రైళ్లు వివిధ రైల్వే స్టేష‌న్ల మ‌ధ్య తిరుగుతాయ‌ని తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల‌కు 28, 30, 1 తేదీల్లో ఉద‌యం 5.45 గంట‌ల‌కు రైళ్లు బ‌యల్దేర‌నున్నాయి. ఆ రైళ్లు మ‌ధ్యాహ్నం ఒక‌టిన్న‌ర‌కు మంచిర్యాల‌కు చేరుకుని, రాత్రి 10.10 గంట‌ల‌కు తిరుగుప్ర‌యాణ‌మ‌వుతాయి.

సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌కు 29, 31 తేదీల్లో ఉద‌యం 5.45 గంట‌ల‌కు రైళ్లు బ‌యల్దేర‌నున్నాయి. ఆ రైళ్లు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు సిర్పూర్ కాగ‌జ్‌న‌గ‌ర్‌కు చేరుకుని, మ‌ధ్యాహ్నం రెండున్న‌ర‌ గంట‌ల‌కు తిరుగుప్ర‌యాణ‌మ‌వుతాయి.

నిజామాబాద్‌ నుంచి వ‌రంగ‌ల్‌కు 28, 29, 30, 31 తేదీల్లో ఉద‌యం 7.05 గంట‌ల‌కు రైళ్లు బ‌యల్దేర‌నున్నాయి. ఆ రైళ్లు మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వ‌రంగ‌ల్ చేరుకుని, మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల‌కు తిరుగుప్ర‌యాణ‌మ‌వుతాయి.

కాజీపేట్‌ నుంచి ఖ‌మ్మంకు 28, 29, 30, 31 తేదీల్లో మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు రైళ్లు బ‌యల్దేర‌నున్నాయి. ఆ రైళ్లు సాయంత్రం అయిదున్న‌ర‌ గంట‌ల‌కు ఖ‌మ్మం చేరుకుని, తెల్ల‌వారి ఉద‌యం ప‌ది గంట‌ల‌కు తిరుగుప్ర‌యాణ‌మ‌వుతాయి.

ఆదిలాబాద్ నుంచి కాజీపేట్‌కు 28న రాత్రి 11.30 గంట‌ల‌కు రైలు బ‌యల్దేర‌నుంది. ఆ రైలు తెల్ల‌వారి ఉద‌యం 11.45కు కాజీపేట్ చేరుకుని మ‌ధ్యాహ్నం 1.15 గంట‌ల‌కు తిరుగుప్ర‌యాణ‌మ‌వుతాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement