త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MMTS Railway Stations | హైదరాబాద్‌లో కొత్త‌గా మ‌రో మూడు ఎంఎంటీఎస్ రైల్వే స్టేష‌న్లు..!

MMTS Railway Stations | హైద‌రాబాద్ ప్ర‌యాణికుల‌ను దృష్టిలో ఉంచుకున్న రైల్వే అధికారులు.. న‌గ‌రంలో కొత్త‌గా మ‌రో మూడు ఎంఎంటీఎస్ రైల్వే స్టేష‌న్లు ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది.

S

Hyderabad | Published On May 7, 2026, 8.07 am IST

MMTS Railway Stations | హైదరాబాద్‌లో కొత్త‌గా మ‌రో మూడు ఎంఎంటీఎస్ రైల్వే స్టేష‌న్లు..!
Advertisement

MMTS Railway Stations | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ ప్ర‌యాణికుల‌ను దృష్టిలో ఉంచుకున్న రైల్వే అధికారులు.. న‌గ‌రంలో కొత్త‌గా మ‌రో మూడు ఎంఎంటీఎస్ రైల్వే స్టేష‌న్లు ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు ప్రారంభించింది. అల్వాల్‌లోని ల‌యోలా కాలేజీ వ‌ద్ద‌, ఆనంద్ బాగ్, మౌలాలిలో కొత్త‌గా రైల్వే స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మూడు ప్రాంతాల్లో ఎంఎంటీఎస్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌యాణికుల నుంచి ఎన్నో ఏండ్ల నుంచి డిమాండ్ ఉంది. ఈ క్ర‌మంలో ఈ మూడు స్టేష‌న్ల ఏర్పాటును కోరుతూ.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డు ఆమోదం కోసం ప్ర‌తిపాద‌న‌లు పంపారు. రైల్వే బోర్డు ఆమోదం కోసం స్థానిక రైల్వే అధికారులు ఎదురుచూస్తున్నారు.

ఘ‌ట్‌కేస‌ర్ - స‌న‌త్‌న‌గ‌ర్ ఎంఎంటీఎస్ కారిడార్‌లో రోజురోజుకు ప్ర‌యాణికుల ర‌ద్దీ ఎక్కువైపోతుంది. ఈ క్ర‌మంలోనే గ‌త కొన్నేండ్ల నుంచి ఈ మార్గంలో అదనంగా ఆరు రైల్వే స్టేష‌న్ల ఏర్పాటుకు డిమాండ్ ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌యాణికుల నుంచి అనేక విజ్ఞ‌ప్తులు వ‌చ్చాయి. దీంతో మ‌ళ్లీ రైల్వే అధికారులు రైల్వే స్టేష‌న్ల ఏర్పాటు దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

ఈ మేర‌కు కొత్త రైల్వే స్టేష‌న్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల‌ను అంచ‌నా వేశారు. ముఖ్యంగా లెవ‌ల్ క్రాసింగ్ పాయింట్ల వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హించారు. అనంత‌రం రైల్వే బోర్డు ఉన్న‌తాధికారుల‌కు ప్ర‌తిపాద‌న పంపారు.

అయితే చ‌ర్ల‌ప‌ల్లి - నేరెడ్‌మెట్ మ‌ధ్య ఆనంద్ బాగ్ వ‌ద్ద రైల్వే స్టేష‌న్ నిర్మించాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది. ఎందుకంటే ఈ స్ట్రెచ్‌లో ప్ర‌తి రెండు కిలోమీట‌ర్ల దూరానికి ఒక రైల్వే స్టేష‌న్‌ను ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది. కానీ కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే మ‌ల్కాజ్‌గిరితో పాటు స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌లు రైలు ప్ర‌యాణం చేయాలంటే అటు చ‌ర్ల‌ప‌ల్లి కానీ, ఇటు నేరెడ్‌మెట్ కానీ వెళ్లాల్సిన ప‌రిస్థితి ఉంది. ఆనంద్‌బాగ్ వ‌ద్ద స్టేష‌న్ నిర్మిస్తే స్థానిక ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు త‌ప్పుతాయి.

Advertisement
Advertisement