త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sathish Reddy | ఆమె సీత‌క్క కాదు.. స్కాంల‌క్క‌గా మారింది

Sathish Reddy | రాష్ట్ర మంత్రి సీత‌క్క స్కాంల‌క్క‌గా మారింద‌ని.. ములుగులో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డితో క‌లిసి రూ.200 కోట్ల అక్ర‌మ ఇసుక‌ దందా చేస్తున్నార‌ని రెడ్కో కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ స‌తీశ్‌రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. నెల రోజుల వ్యవధిలోనే ప్ర‌క్రియ అంతా పూర్తి చేసి గోదావరిలో అక్రమంగా ఇసుక‌ తొవ్వడం మొదలుపెట్టారని విమ‌ర్శించారు.

S

Telangana | Published On Jun 20, 2026, 3.45 pm IST

Sathish Reddy | ఆమె సీత‌క్క కాదు.. స్కాంల‌క్క‌గా మారింది
Advertisement
  • పొంగులేటితో క‌లిసి గోదావ‌రిలో అక్ర‌మ దందా చేస్తున్నారు
  • ఇందుకోసం బ‌దిలీ అవుతున్న క‌లెక్ట‌ర్ ప‌ర్మిష‌న్ ఇచ్చారు
  • ములుగులో రూ.200 కోట్ల వ్యాపారం జ‌రుగుతోంది
  • మంత్రి సీత‌క్క‌పై రెడ్కో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆరోప‌ణ‌లు

Sathish Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర మంత్రి సీత‌క్క స్కాంల‌క్క‌గా మారింద‌ని.. ములుగులో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డితో క‌లిసి రూ.200 కోట్ల అక్ర‌మ ఇసుక‌ దందా చేస్తున్నార‌ని రెడ్కో కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ స‌తీశ్‌రెడ్డి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇసుక త‌వ్వెందుకు బదిలీ అవుతున్న కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. పిసా చట్టం ప్రకారం గ్రామ సభ పెట్టాలన్నారు. నెల రోజుల వ్యవధిలోనే ప్ర‌క్రియ అంతా పూర్తి చేసి గోదావరిలో అక్రమంగా ఇసుక‌ తొవ్వడం మొదలుపెట్టారని విమ‌ర్శించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

20 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్లు త‌వ్వారు..

12 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక త‌వ్వేందుకు పర్మిషన్ ఇచ్చారు. కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక పర్మిషన్‌ను మైనింగ్ అధికారులు రద్దు చేయడం లేదు. 15 నుంచి 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇప్పటికే త‌వ్వారు. ములుగులో రూ.100 నుంచి 200 కోట్ల రూపాయల ఇసుక వ్యాపారం జరుగుతుంది. ఇసుక మైనింగ్ పై పాలేరు సభలో కేటీఆర్ మాట్లాడారు. వాస్తవాలు బయట పెట్టిన కేటీఆర్‌ను క్షమాపణ చెప్పాలని అంటున్నారు. 4 వేల కోట్ల రూపాయల ఇసుక దోచుకునేందుకు సీతక్క , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధమయ్యారు. అక్రమ ఇసుకపై కొందరు యువకులు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తే కేసులు పెట్టారు అని ఆయ‌న ఆరోపించారు.

ఎందెందు ఎతికినా కాంగ్రెస్ స్కాంలే..

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇబ్బడి ముబ్బడిగా మంత్రులు అక్రమంగా దోచుకుంటున్నారు. ఇందుకలదు అందులేదు ఎందెందు ఎతికినా కాంగ్రెస్ స్కాంలు కనిపిస్తున్నాయి. ఇసుక త‌వ్వాలంటే ఎన్విరాన్‌మెంట్ అనుమతి తీసుకోవాలి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక త‌వ్వుతున్నారు. సీతక్క, పొంగులేటి ఇసుక దోచుకోవడానికి ప్రణాళిక వేశారు. సీతమ్మ సాగర్ దగ్గర డిసిల్టేషన్‌కు పర్మిషన్ ఉండదు. పిల్లర్లు తప్పా బరాజ్ లేని సీతమ్మ సాగర్ వద్ద ఇసుక ఎలా త‌వ్వుతారు అని స‌తీశ్‌రెడ్డి నిల‌దీశారు.

Advertisement
Advertisement