త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thummala Nageswara Rao | సొంతూరులో న‌డ‌వ‌ని మంత్రి తుమ్మ‌ల మంత్రాంగం..!

Thummala Nageswara Rao | సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని మంత్రులంద‌రూ త‌మ సొంతూర్ల‌లో స‌ర్పంచ్ ప‌ద‌వుల‌ను ఏక‌గ్రీవం చేసే దిశ‌గా ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నాల్లో ఇప్ప‌టికే కొంద‌రు మంత్రుల మంత్రాంగం ఫ‌లించింది. కానీ కొంద‌రి మంత్రులకు మాత్రం తమ గ్రామాల్లో తీవ్ర‌ నిర‌స‌న వ్య‌క్తమ‌వుతుంది.

S

Telangana | Published On Dec 7, 2025, 4.22 pm IST

Thummala Nageswara Rao | సొంతూరులో న‌డ‌వ‌ని మంత్రి తుమ్మ‌ల మంత్రాంగం..!
Advertisement

Thummala Nageswara Rao | హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని మంత్రులంద‌రూ త‌మ సొంతూర్ల‌లో స‌ర్పంచ్ ప‌ద‌వుల‌ను ఏక‌గ్రీవం చేసే దిశ‌గా ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ ప్ర‌య‌త్నాల్లో ఇప్ప‌టికే కొంద‌రు మంత్రుల మంత్రాంగం ఫ‌లించింది. కానీ కొంద‌రి మంత్రులకు మాత్రం తమ గ్రామాల్లో తీవ్ర‌ నిర‌స‌న వ్య‌క్తమ‌వుతుంది. ఈ జాబితాలో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు చేరారు.

రాష్ట్ర మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు సొంతూరు గొల్ల‌గూడెంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయ‌ణ స్వ‌గ్రామ‌మైన గుండుగుల‌ప‌ల్లి గ్రామంలో స‌ర్పంచ్ ఏక‌గ్రీవ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారు అభ్య‌ర్థిని ఏక‌గ్రీవం చేయ‌డానికి కాంగ్రెస్ నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ సాధ్యం కాలేదు. బీఆర్ఎస్ పార్టీ బ‌ల‌ప‌రిచిన సర్పంచ్ అభ్య‌ర్థి సాంబ‌శివుడు త‌న నామినేష‌న్‌ను ఉప‌సంహ‌రించుకోలేదు. గత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుడు సర్పంచ్‌గా, కాంగ్రెస్ మద్దతుదారుడు ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవం అయ్యారు. కానీ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెచ్చు ఈదప్ప, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పండు సాంబశివుడు బ‌రిలో ఉండడంతో పంచాయ‌తీ ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement