Ashada Bonalu | ఘనంగా ప్రారంభమైన ఆషాఢ బోనాలు.. భక్తజన సందోహంగా గోల్కొండ
Ashada Bonalu | తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టే ఆషాఢ బోనాల (Ashada Bonalu) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో (Golconda Fort) కొలువుదీరిన శ్రీ జగదాంబిక (Sri Jagadamba Mahankali Temple) అమ్మవారికి 11 బోనాలతో కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు.
Ashada Bonalu | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టే ఆషాఢ బోనాల (Ashada Bonalu) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో (Golconda Fort) కొలువుదీరిన శ్రీ జగదాంబిక (Sri Jagadamba Mahankali Temple) అమ్మవారికి 11 బోనాలతో కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లంగర్‌హౌస్ నుంచి బంగారు బోనం ఊరేగింపుగా బయలుదేరింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ప్రభుత్వ బోనంతో పాటు నజర్ బోనం, ఆలయ పూజారి ఇంటి నుంచి వచ్చే మరో బోనాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. తొలి రోజు మూడు ప్రధాన బోనాల సమర్పణ అనంతరం ఆషాఢమాసం అంతా వివిధ ఆలయాల్లో బోనాల వేడుకలు కొనసాగుతాయి. బోనాల వేడుకతో గోల్కొండ పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంగా మారాయి.
గోల్కొండ బోనాలతో మొదలయ్యే జాతర (Bonalu Festival).. ఆషాఢ మాసం మొత్తం కొనసాగుతుంది. ప్రతి ఆదివారం ఒక్కో ప్రాంతంలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పిస్తూ భక్తులు వేడుకలను నిర్వహిస్తారు. భాగ్యనగరంలో తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, మూడో ఆదివారం చిలకలగూడ పోచమ్మతో పాటు పాతబస్తీలోని లాల్ దర్వాజా మాతేశ్వరి ఆలయంలో, నాలుగో ఆదివారం షా అలీబండ అక్కన్న–మాదన్న మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
సీఎం రేవంత్ శుభాకాంక్షలు..
రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, ఆధ్యాత్మిక విశ్వాసానికి అద్దం పట్టే ఈ వేడుకల ప్రారంభం సందర్భంగా నగర ప్రజలకు, భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్న ఈ పవిత్ర వేళ, ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు. అమ్మవారిపై అచంచల విశ్వాసంతో సమర్పించే ప్రతి బోనం, ప్రతి ప్రార్థన ప్రజల జీవితాల్లో సిరిసంపదలు, సంతోషం, ధైర్యం, విజయాలను నింపాలని ఆకాంక్షించారు. శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారి అనుగ్రహం సకల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
- ●వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?
- ●Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'
- ●Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!
- ●Traffic Restrictions | రేపు నల్లగొండ ఎక్స్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- ●Rajanna Temple | శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి

Telangana | దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన

వైన్, విస్కీల సీక్రెట్ బాక్స్: అసలు ఈ 'ఓక్' మ్యాజిక్ ఏంటి భయ్యా?

Vemula Prashanth Reddy | కాంగ్రెస్ పాలన 1,000 అబద్ధాల 'దగాపాలన'

Toxic Movie | ముగ్గురు భామలకు ‘టాక్సిక్’.. యశ్ సినిమాతో తలకిందులైన అంచనాలు..!






