Bonalu 2026 | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఆషాఢ బోనాలు.. రేపే తొలిబోనం
Bonalu 2026 | తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవన విధానంలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఇతర పండుగల్లా ఒకే తిథి, ఒకే రోజుకు పరిమితం కాకుండా ఆషాఢమాసం మొత్తం ఈ ఉత్సవాలు కొనసాగడం బోనాల ప్రత్యేకత. ప్రతి ఆదివారం ఒక్కో ప్రాంతంలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పిస్తూ భక్తులు వేడుకలను నిర్వహిస్తారు.
Devotional | Published On Jul 15, 2026, 11.10 am IST
Bonalu 2026 | తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవన విధానంలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఇతర పండుగల్లా ఒకే తిథి, ఒకే రోజుకు పరిమితం కాకుండా ఆషాఢమాసం మొత్తం ఈ ఉత్సవాలు కొనసాగడం బోనాల ప్రత్యేకత. ప్రతి ఆదివారం ఒక్కో ప్రాంతంలో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పిస్తూ భక్తులు వేడుకలను నిర్వహిస్తారు. భాగ్యనగరంలో తొలి ఆదివారం గోల్కొండ జగదాంబిక ఆలయంలో, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, మూడో ఆదివారం చిలకలగూడ పోచమ్మతో పాటు పాతబస్తీలోని లాల్ దర్వాజా మాతేశ్వరి ఆలయంలో, నాలుగో ఆదివారం షా అలీబండ అక్కన్న–మాదన్న మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
ఆదిపరాశక్తిని అమ్మగా భావించి..
తెలంగాణ జానపద సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగలో ఆదిపరాశక్తిని అమ్మగా భావించి భక్తులు బోనాలు సమర్పిస్తారు. డప్పుల మోతలు, ఒగ్గు దరువులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, పసుపు–కుంకుమల సోయగం, వేపమండల సువాసనలు బోనాల జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రామీణ జానపద గీతాలతో భక్తులు అమ్మవారిని కీర్తిస్తూ ఉత్సాహంగా పాల్గొంటారు. శిరస్సుపై బోనం మోసుకొచ్చే మహిళలు, వారి వెంట నృత్యాలు చేసే పోతురాజులు, అంబారీలు, తొట్టెల ఊరేగింపులు, ఫలహార బళ్ల ప్రదర్శనలు ఆషాఢమాసం అంతా పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాయి.
జానపద విశ్వాసాలకు ప్రతీక
వర్షాకాలంలో వ్యాధులు, విపత్తుల నుంచి రక్షణ కలగాలని ఆదిపరాశక్తిని ఆరాధించడం జానపదుల ఆనవాయితీ. సూకాలమ్మ, ముత్యాలమ్మ, మరిడమ్మ, మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, గంగానమ్మ వంటి గ్రామదేవతలను ప్రజలు తమ ప్రాంత రక్షక దేవతలుగా కొలుస్తారు. ప్రకృతి శక్తుల ప్రతిరూపాలైన ఈ దేవతలను ఆషాఢంలో విశేషంగా పూజించడం వల్ల శారీరక, మానసిక బలం పెరుగుతుందని భక్తుల నమ్మకం. వైదిక సంప్రదాయాలకు అతీతంగా గ్రామీణ జీవన విధానంలో ఈ ఆరాధన శతాబ్దాలుగా కొనసాగుతోంది.
బోనం ఇలా..
బోనం కోసం కొత్త మట్టికుండను తీసుకుని సగం వరకు సున్నం పూసి, మిగిలిన భాగాన్ని పసుపు, కుంకుమ బొట్లతో అలంకరిస్తారు. అందులో వండిన అన్నం, బియ్యం–పెసరపప్పు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని ఉంచుతారు. కొండపై ‘గురిగి’గా పిలిచే చిన్న పాత్రను అమర్చి వేపమండలతో అలంకరించి, చిప్పలో దీపం వెలిగిస్తారు. ఇటీవల మట్టికుండలతో పాటు ఇత్తడి పాత్రల్లో కూడా బోనాలు సిద్ధం చేస్తున్నారు. అలంకరించుకున్న మహిళలు డప్పుల మోతల మధ్య బోనాలను ఆలయాలకు తీసుకెళ్తారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు భక్తులను ఆకట్టుకుంటాయి. బోనం మోసుకెళ్తున్న వారి కాళ్లపై నీరు పోయడం కూడా సంప్రదాయంలో భాగమే. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. సాధారణంగా బోనంలో సమర్పించిన అన్నాన్ని తిరిగి ఇంటికి తీసుకురాకుండా, కొద్దిపాటి ప్రసాదాన్ని మాత్రమే తీసుకెళ్తారు. కొన్నిచోట్ల బోనం అన్నాన్ని గ్రామ పొలిమేరల్లో చల్లే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది.
గోల్కొండలో తొలి బోనం
జూలై 16న గోల్కొండ జగదంబిక ఆలయంలో తొలి బోనంతో రాష్ట్రవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టుచీర, బోనాన్ని లంగర్‌హౌస్ నుంచి ఘన ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్తారు. ముందుగా పూజారి ఇంటి వద్ద ఉన్న ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలు సమర్పించి, అనంతరం డప్పులు, ఒగ్గుడోలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఘటాలను కోటపైకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రభుత్వ బోనంతో పాటు నజర్ బోనం, ఆలయ పూజారి ఇంటి నుంచి వచ్చే మరో బోనాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. తొలి రోజు మూడు ప్రధాన బోనాల సమర్పణ అనంతరం ఆషాఢమాసం అంతా వివిధ ఆలయాల్లో బోనాల వేడుకలు కొనసాగుతాయి.
సామూహిక ఘటాల ఊరేగింపుతో..
పాతబస్తీలో అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపుతో బోనాల వేడుకలకు మరింత ఊపు వస్తుంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో జరిగే లష్కర్ బోనాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి బోనాలు సమర్పిస్తారు. అనంతరం రంగం కార్యక్రమం, అంబారీ ఊరేగింపు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. గోల్కొండలో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు నెల రోజుల అనంతరం లాల్ దర్వాజా సింహవాహిని బోనాలతో ఘనంగా ముగుస్తాయి.
బోనాల షెడ్యూల్
జూలై 16: గోల్కొండ జగదంబిక బోనాల ప్రారంభం
జూలై 21 : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం
ఆగస్టు 2 : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి లష్కర్ బోనాలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

ICC ODI World Cup | వన్డే వరల్డ్ కప్ 2027 ఫార్మాట్లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం
జులై 15, 2026

Priyanka Chopra | ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. 14 నెలలుగా అదే పనిలో ఉన్నానంటూ..!
జులై 15, 2026

Rukmini Vasanth | రజినీకాంత్ భారీ ప్రాజెక్ట్‌లో ‘కాంతార’ బ్యూటీకి ఛాన్స్..!
జులై 15, 2026
తాజావార్తలు
- ●ICC ODI World Cup | వన్డే వరల్డ్ కప్ 2027 ఫార్మాట్లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం
- ●KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- ●KTR | ఇంకెవరో టీఆర్ఎస్ను తీసుకుంటామంటే ఒప్పుకోం.. బంధం కంటే పార్టీనే ముఖ్యం : కేటీఆర్
- ●Priyanka Chopra | ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. 14 నెలలుగా అదే పనిలో ఉన్నానంటూ..!
- ●Telangana Education Kit | విద్యార్థులకు శుభవార్త.. పంద్రాగస్టు లోపు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్
- ●CM Revanth Reddy | టీచర్ల బదిలీలు అత్యంత కఠినం.. వారికి ఆ తెలివితేటలు ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి

ICC ODI World Cup | వన్డే వరల్డ్ కప్ 2027 ఫార్మాట్లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం

KTR Delhi Chit Chat | రేవంత్ సీక్రెట్ సర్వేల్లో బీఆర్ఎస్దే గెలుపు.. వచ్చే ఏడాది నా పాదయాత్ర: ఢిల్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR | ఇంకెవరో టీఆర్ఎస్ను తీసుకుంటామంటే ఒప్పుకోం.. బంధం కంటే పార్టీనే ముఖ్యం : కేటీఆర్

Priyanka Chopra | ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. 14 నెలలుగా అదే పనిలో ఉన్నానంటూ..!



